Realme P3 Pro డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తోందా.. డిజైన్ ఆన్‌లైన్‌లో లీక్
భారత్‌లో త్వరలోనే Realme P3 సిరీస్ విడుదల కానుంది. ఈ లైనప్‌లో స్టాండర్డ్ Realme P3, Realme P3 ప్రో ఉంటాయి. ఇప్పటికే కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రాబోయే కొత్త ఫోన్‌ల రిలీజ్‌ను టీజ్ చేసింది. అంతే కాదు, ఈ హ్యాండ్‌సెట్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడైంది. ఈ ప్రకటనకు ముందే, ప్రో మోడల్ డిజైన్ గురించిన ఓ కొత్త లీక్ బహిర్గతమైంది. ఫోన్ రెండర్‌లు వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను చూపుతున్నాయి. గత సంవత్సరం వచ్చిన Realme P2 ప్రో కంటే అప్‌గ్రేడ్‌లతో Realme P3 ప్రో వచ్చే అవకాశం ఉంది