డిసెంబర్ 9న ఇండియన్ మార్కెట్‌లోకి Redmi Note 14 సిరీస్ లాంచ్
చైనాలో లాంచ్ అయిన దాదాపు మూడు నెలల తర్వాత Redmi Note 14 సిరీస్ భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. రానున్న డిసెంబర్ 9న ఇది దేశీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌తో మూడు మోడళ్లలలో రానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ విడుదలకు ముందు Xiaomi ఇండియా టాప్-ఆఫ్-ది-లైన్ Redmi Note 14 ప్రో+ మోడల్‌కు చెందిన కీలక స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేసింది. ఇది చైనీస్ వేరియంట్‌ను పోలిన ఒంపు ఉన్న AMOLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్‌లను చూపిస్తోంది. మరెందుకు ఆలస్యం.. Redmi Note 14 ప్రో+ ప్రత్యేకతలను తెలుసుకుందామా