Sony Liv

Sony Liv - ख़बरें

  • మార్కో OTT రిలీజ్‌ తేదీ వ‌చ్చేసింది: ఫిబ్ర‌వ‌రి 14న‌ Sony LIVలో ప్రసారం
    అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తోన్న‌ మలయాళ యాక్షన్-థ్రిల్లర్ మూవీ మార్కో OTT విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. Sony LIVలో ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రసారం కానున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. విజయవంతమైన థియేటర్ రన్ తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడంతో మ‌రింత ప్రేక్ష‌కాధార‌ణ పొందుతుందని భావిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా బహుళ భాషలలో అందుబాటులోకి రానుంది.
  • OTTలోకి త్వ‌ర‌లో మ‌ళ‌యాల బ్లాక్ బాస్ట‌ర్ మూవీ మార్కో.. భారీ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ Sony LIV
    యువ‌ న‌టుడు ఉన్ని ముకుందన్ హీరోగా న‌టించిన యాక్షన్-డ్రామా చిత్రం మార్కో. థియేటర్‌ల‌లో ఘ‌న‌ విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లకుపైగా వసూలు చేసి ప‌లు రికార్డులను బద్దలు కొట్టింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వైలెన్స్‌తోపాటు ఉత్కంఠభరితమైన కథనంతో రూ. 100 కోట్ల మార్కును అధిగమించిన మొదటి A- రేటింగ్ పొందిన మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత, సంచలనాత్మక OTT ఒప్పందాన్ని చేసుకోవ‌డం ద్వారా మరొక రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సినిమా డిజిటల్ హక్కులను Sony LIV సంస్థ సొంతం చేసుకుంది. మలయాళ చ‌ల‌న చిత్ర‌ చరిత్రలో అత్యధిక ధరను పొందినట్లు సమాచారం.

Sony Liv - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »