Vivo T4x 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర రేంజ్‌తోపాటు కీలక స్పెసిఫికేషన్స్ లీక్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో Vivo T4x 5G గతంలోనే కనిపించడంతోపాటు మన దేశంలో దీని లాంఛ్ త్వరలోనే ఉంటుందని సూచించింది. తాజాగా, ఒక నివేదిక ప్రకారం.. అంచనా వేసిన లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అందుబాటు ధర రేంజ్‌తోపాటు కలర్ ఆప్షన్‌లు, డిజైన్‌కు సంబంధించిన అంశాలు కూడా వెల్లడయ్యాయి. రాబోయే Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ గత ఏడాది ఏప్రిల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో దేశంలో విడుదలైన Vivo T3x 5Gకి కొనసాగింపుగా వస్తున్నట్లు చెబుతున్నారు.