Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ!

IIT Madras Startup Reveals Indias First Passenger Air Taxi e200X: రెక్కలు కలిగిన ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలలో ఇది ప్రపంచంలోనే అత్యంత కాంపాక్ట్ మోడళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ!

Photo Credit: The ePlane Company

IIT Madras

ముఖ్యాంశాలు
  • ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ
  • హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యే టాటా ఈప్లేన్ e200X!
  • ఆకాశంలో ఎగిరే కారును తీసుకొచ్చిన భారతీయ ఐఐటీ స్టార్టప్
ప్రకటన

IIT Madras Startup Reveals Indias first passenger Air Taxi e200X: భారత్‌లో భవిష్యత్తు ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి చెప్పేందుకు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ (eVTOL) సాంకేతికత దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ది ఈప్లేన్ కంపెనీ తమ డ్రీమ్ ప్రాజెక్ట్  e200X అనే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిస్థాయి ప్రొటోటైప్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. రెక్కలు కలిగిన ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలలో ఇది ప్రపంచంలోనే అత్యంత కాంపాక్ట్ మోడళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. నగరాల్లో కొత్తగా భారీ వర్టిపోర్టులు కట్టాల్సిన అవసరం లేకుండా, ఇళ్ల కప్పులపై ఉండే సాధారణ హెలిప్యాడ్‌ల నుంచే ఇది టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

అసలు ఏంటి ఈ e200X? ప్రత్యేకతలేంటి..?

e200X అనేది 2.2 టన్నుల బరువు కలిగిన ఒక ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో ఒక పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. ప్రయాణికులు లేని సమయంలో దాదాపు 200 కిలోల వరకు కార్గో (సరుకులు) మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌పై ఇది దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక దీని సైజు విషయానికి వస్తే.. కేవలం 8 మీటర్లు × 11 మీటర్ల పరిమాణంతో అత్యంత తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. భారతీయ నగరాల రద్దీ వాతావరణానికి ఇది సరిగ్గా సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

హెలిప్యాడ్‌ల నుంచి ఎగరగలదా? ప్రపంచంలో ఇదే మొదటిదా.?

చిన్నపాటి పరిమాణం కారణంగా దీనిని ప్రస్తుతం ఉన్న హెలిప్యాడ్‌లు, ఖాళీ స్థలాలు, సాంకేతికంగా సిద్ధం చేసిన అపార్ట్‌మెంట్ భవనాల కప్పుల నుంచి నడిపే వీలుంది. అయితే పూర్తిస్థాయి వినియోగంలోకి రావడానికి భద్రతా ప్రమాణాలు, అధికారిక నిబంధనల అనుమతులు తప్పనిసరి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్, ఆర్చర్ ఏవియేషన్, బ్రిటన్ వర్టికల్ ఏరోస్పేస్ వంటి సంస్థలు ఈ రేసులో ఉన్నాయి. కానీ భారతీయ వాతావరణం, రోడ్లకు తగ్గట్లు చిన్న పరిమాణంలో డిజైన్ చేయడమే e200X ప్రధాన ప్లస్ పాయింట్.

Truth Social : ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే

ప్రత్యేకమైన డిజైన్.. ముందున్న మైలురాళ్లు

ఈ ఎయిర్ టాక్సీలో పైకి లేవడానికి 8 ఫిక్స్డ్ వర్టికల్-లిఫ్ట్ ప్రొపెల్లర్లు, ముందుకు సాగడానికి ప్రత్యేక ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చారు. దీనివల్ల ప్రొపెల్లర్లను తిప్పాల్సిన అవసరం లేకుండా మెకానికల్ సంక్లిష్టత తగ్గి, మెయింటెనెన్స్ ఎంతో తేలికవుతుంది. అంతేకాకుండా పేటెంట్ పొందిన సిలర్జిస్టిక్ లిఫ్ట్ వింగ్ డిజైన్‌తో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రొటోటైప్ దశలోనే ఉన్నందున, భద్రతా పరీక్షలు, డీజీసీఏ నిబంధనల ఆమోదం పొందిన తర్వాత వ్యాపారాత్మకంగా రోడ్లపైకి.. అపాయింట్మెంట్ ఇస్తే ఆకాశంలోకి ఎగరనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. iPhone Price Hike : 17 ఐఫోన్ కొనాలనుకునే వారికి ఆపిల్ ఊహించని షాక్.. ఒకేసారి 11 శాతం పెరిగిన ధరలు
  2. Google Pixel 11a : డిస్‌ప్లే, కెమెరాలో భారీ మార్పులు.. విప్లవాత్మక ఫీచర్లతో గూగుల్ కొత్త అఫోర్డబుల్ ఫోన్
  3. XElectron Projector : రూ.6,990కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్
  4. Japan scientist Made Human Refrigerator: బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్
  5. Indias Air Taxi e200X: ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ!
  6. Vivo X300 E Launching on July 27: వివో నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. జీస్ కెమెరాతో వివో X300 E రాక!
  7. Portronics Pure Sound Pro X2: ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్
  8. Samsung Galaxy Unpacked Event on July 22: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం
  9. Trump Media: ట్రంప్ ట్వీట్ ముందే కావాలా..? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే!
  10. Oppo A7 Pro Max Features Leaked: మార్కెట్లోకి ఒప్పో A7 ప్రో మాక్స్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో సరికొత్త రికార్డు!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »