హై-ఎండ్ మోడల్ అయిన itel Soundbar 160W ధరను రూ.6,349 గాను, అలాగే itel Soundbar 120W మోడల్ ధరను రూ.4,649 గాను లాంచ్ చేసింది.
Photo Credit: itel Soundbar
itel Soundbar
itel Soundbar : బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్, హోమ్ ఆడియో విభాగంలో తమ మార్కెట్‌ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా భారతీయ వినియోగదారుల కోసం రెండు పవర్‌ఫుల్ సౌండ్‌బార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐటెల్ సౌండ్‌బార్ 160W, ఐటెల్ సౌండ్‌బార్ 120W పేరుతో వీటిని పరిచయం చేసింది. ఇవి లేటెస్ట్ ఐథంప్‌ఎక్స్ బేస్ టెక్నాలజీ, అధునాతన డీఎస్‌పీ చిప్‌సెట్, అద్భుతమైన స్పీకర్ సెటప్‌తో హోమ్ థియేటర్ అనుభూతిని ఇస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
వినియోగదారుల జేబుకు భారం కాకుండా ఐటెల్ ఈ డివైజ్‌ల ధరలను చాలా రీజనబుల్‌గా నిర్ణయించింది. హై-ఎండ్ మోడల్ అయిన itel Soundbar 160W ధరను రూ.6,349 గాను, అలాగే itel Soundbar 120W మోడల్ ధరను రూ.4,649 గాను లాంచ్ చేసింది. ఈ రెండు సౌండ్‌బార్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనపు రక్షణగా కంపెనీ 12 నెలల (1 సంవత్సరం) వారంటీని ఇస్తోంది. అంతేకాకుండా, కస్టమర్ల కోసం బాక్స్ లోపలే గోడకు తగిలించుకునే ఉచిత వాల్ మౌంట్ కిట్‌ను కూడా ఉంచడం విశేషం.
ఈ రెండు మోడళ్ల స్పెసిఫికేషన్లను గమనిస్తే.. టాప్ వేరియంట్ అయిన 160W మోడల్‌లో హై-క్వాలిటీ గల క్వాడ్-స్పీకర్ (నలుగు స్పీకర్లు) కాన్ఫిగరేషన్‌ను అందించారు. అదే సమయంలో 120W మోడల్‌లో పవర్‌ఫుల్ డ్యూయల్-స్పీకర్ సెటప్‌ను ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలోనూ ఐటెల్ సంస్థకు చెందిన సిగ్నేచర్ iThumpX BASS టెక్నాలజీని ఉపయోగించారు. దీనితో పాటు ఇందులో అమర్చిన నియోడైమియం మాగ్నెట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను చాలా క్రిస్టల్ క్లియర్‌గా మార్చడమే కాకుండా, బేస్ పవర్‌ను భారీగా పెంచుతాయి.
ఐటెల్ తమ కొత్త సౌండ్‌బార్లలో అత్యాధునిక డీఎస్‌పీ చిప్‌సెట్‌ను అమర్చింది. ఇది విభిన్నమైన ఫ్రీక్వెన్సీల సౌండ్ సెపరేషన్‌ను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేస్తుంది. దీనివల్ల గదిలో కూర్చున్నప్పుడు వర్చువల్ 360-డిగ్రీ ఆడియో ఎఫెక్ట్ లభిస్తుంది, అంటే సౌండ్ అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి తోడు అడ్వాన్స్‌డ్ విండ్ పైప్ టెక్నాలజీ, ముందు భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా జోడించారు. ఇవన్నీ కలిసి గది మొత్తం బేస్ వైబ్రేషన్స్ వ్యాపించేలా లోతైన ఆడియో అనుభూతిని అందిస్తాయి.
Redmi 17C : రెడ్‌మి నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్.. చైనా మార్కెట్లో రెడ్‌మి 17C గ్రాండ్ లాంచ్
కనెక్టివిటీ పరంగా ఈ సౌండ్‌బార్లు ఎంతో స్మార్ట్‌గా పనిచేస్తాయి. ఇందులో సూపర్ ఫాస్ట్ కనెక్షన్ కోసం బ్లూటూత్ 5.3 సపోర్ట్‌ను ఇచ్చారు. దీనివల్ల మొబైల్స్, లాప్‌టాప్స్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టీవీలు, ఇతర హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్‌ల కోసం TV (ARC), ఆప్టికల్ పోర్ట్, AUX, USB, ఒక ఎస్‌డబ్ల్యూ అవుట్ పోర్టులను కూడా అందించారు. యూజర్లు కారు హోమ్ థియేటర్‌ను ఆపరేట్ చేయడం సులభతరం చేసేందుకు, దీనిని మీ ఇంట్లోని నార్మల్ టీవీ రిమోట్‌తోనే కంట్రోల్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది.
వినియోగదారులు చూసే కంటెంట్‌కు తగినట్లుగా ఆడియో ప్రొఫైల్‌ను మార్చుకోవడానికి ఇందులో మూడు ప్రత్యేకమైన ఈక్యూ మోడ్స్ ను అందించారు. ఇందులో మూవీ మోడ్, గేమింగ్ మోడ్, మ్యూజిక్ మోడ్స్ ఉన్నాయి. మీరు సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి డైలాగ్ క్లారిటీని, గేమ్స్ ఆడుతున్నప్పుడు బేస్ ఎఫెక్ట్స్‌ను, సాంగ్స్ వింటున్నప్పుడు మెలోడీ శబ్దాలను ఈ మోడ్స్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో ఒక బెస్ట్ సౌండ్‌బార్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy A27 5G Launched With Snapdragon 6 Gen 3 SoC, 6.7-Inch Display: Price, Specifications
Honor Could Be Developing a Smartphone With a Massive 14,000mAh Battery