Photo Credit: Amazfit
Amazfit GTR 4 New comes in Brown Leather and Galaxy Black colourways
ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ Amazfit దేశీయ మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసింది. Amazfit GTR 4 Newని మనదేశంలో లాంచ్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్ 1.45-అంగుళాల AMOLED స్క్రీన్‌తో ఆకర్షణీయమైన క్రౌన్‌ను కలిగి ఉంది. Amazfit GTR 4 New వెర్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్-సిరామిక్ బాటమ్ షెల్‌తో పాటు లెదర్, ఫ్లోరోఎలాస్టోమర్ స్ట్రాప్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ Zepp యాప్‌కి అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌తోపాటు ఇన్‌బిల్ట్ అలెక్సా కంట్రోల్ వంటి ఫీచర్స్‌తో పరియచం చేస్తోంది.
ఇక మన దేశీయ మర్కెట్‌లో Amazfit GTR 4 New ధర రూ. 16,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ మరియు Amazfit India వెబ్‌సైట్ ద్వారా మన దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిష్డ్ కేస్‌లో లభిస్తుంది. బ్రౌన్ లెదర్, గెలాక్సీ బ్లాక్ రెండు ఆప్షన్‌లతో అందించబడుతుంది.
Amazfit GTR 4 New వాచ్ 1.45-అంగుళాల రౌండ్ AMOLED స్క్రీన్‌తో 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్, 326ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యంతోపాటు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వినియోగదారులు గరిష్టంగా 2.3GB MP3 ఫైల్‌లను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్‌బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా అందించారు.
ఇన్‌బిల్ట్ బారోమెట్రిక్ ఆల్టిమీటర్
ఈ కొత్త వేరియంట్ 150 కంటే ఎక్కువ ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉండి, 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. మద్దతు ఇస్తుంది. వాచ్‌లోని హెల్త్ ట్రాకర్‌లలో హృదయ స్పందన రేటు, రక్తం-ఆక్సిజన్ లెవెల్, ఒత్తిడి స్థాయి, శ్వాస రేటు వంటి ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది AI- సపోర్ట్ గల స్లీప్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా అందిస్తుంది. Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇన్‌బిల్ట్ బారోమెట్రిక్ ఆల్టిమీటర్ సహాయంతో వాచ్ వినియోగదారులను వారి లొకేషన్‌ను తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
GPS మోడ్‌తో బ్యాటరీ లైఫ్
Amazfit GTR 4 New 475mAh బ్యాటరీతో సాధారణ వినియోగంతో గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, GPS మోడ్‌తో బ్యాటరీ లైఫ్ 28 గంటలకు తగ్గిపోతుంది. Amazfit GTR 4 New యొక్క స్టెయిన్‌లెస్ స్టీల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్-సిరామిక్ బాటమ్ షెల్, ఛైన్ లేకుండా 49గ్రా బరువు ఉంటుంది. లెదర్ స్ట్రాప్ ఆప్షన్ బరువు 11గ్రా, ఫ్లోరోఎలాస్టోమర్ స్ట్రాప్ వేరియంట్ బరువు 25గ్రాములుగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 5 ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.