Lenovo Aurora GH15 Gaming Headset launched: ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా

Lenovo Aurora GH15 Gaming Headset launched: చైనాలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ JD.com తో పాటు లెనోవో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు.

Lenovo Aurora GH15 Gaming Headset launched: ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా

Photo Credit: Lenovo

Lenovo

ముఖ్యాంశాలు
  • అదిరిపోయే ఫీచర్లతో ‘లెనోవో అరోరా జీహెచ్15’ గేమింగ్ హెడ్‌సెట్ లాంచ్
  • మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా!
  • రూ. 3,500 బడ్జెట్‌లోనే బెస్ట్ గేమింగ్ హెడ్‌సెట్
ప్రకటన

Lenovo Aurora GH15 Gaming Headset launched: ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ లెనోవో, ఆడియో మార్కెట్లోకి సరికొత్త గేమింగ్ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. లెనోవో అరోరా జీహెచ్15 పేరుతో వచ్చిన ఈ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ కేవలం గేమర్ల కోసమే కాకుండా.. హై-క్వాలిటీ మల్టీమీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులను కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. గేమింగ్ ఆడేటప్పుడు సౌండ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇందులో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించారు. ప్రస్తుతానికి ఈ లెనోవో అరోరా జీహెచ్15 గేమింగ్ హెడ్‌సెట్‌ను చైనా మార్కెట్లో కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. అక్కడ దీని ధరను 249 యువాన్లు గా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.3,500గా ఉంటుంది. చైనాలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ JD.com తో పాటు లెనోవో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఇది భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మ్యూజిక్‌తో పాటు మెరిసే ఆర్‌జీబీ లైట్లు..
ఈ హెడ్‌సెట్ అతిపెద్ద ఆకర్షణ, ప్రధాన ఫీచర్ దీనికి ఉన్న RGB లైటింగ్ ఎఫెక్ట్. మనం వినే మ్యూజిక్ లేదా ఆడే గేమింగ్ సౌండ్ బీట్స్‌కు అనుగుణంగా ఈ లైట్లు ఆటోమేటిక్‌గా సింక్ అయ్యి వెలుగుతుంటాయి. ఈ లైట్ల కలర్ కాంబినేషన్లను యూజర్లు తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా లెనోవో అందించింది. అలాగే ఇందులో అమర్చిన 40mm డైనమిక్ డ్రైవర్లు, కస్టమ్ ఎకౌస్టిక్ చాంబర్ వల్ల.. లో-ఫ్రీక్వెన్సీ బేస్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. పాటల్లోని వోకల్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి.

లాగ్ లేని స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..
వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌లో గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ పై జరిగే యాక్షన్‌కు, మనకు వినిపించే సౌండ్‌కు మధ్య కొద్దిగా టైమ్ గ్యాప్ వస్తుంటుంది. ఈ సమస్యను దూరం చేయడానికి లెనోవో అరోరా హెడ్‌సెట్ లో 2.4GHz వైర్‌లెస్ కనెక్టివిటీని ఇచ్చారు. ఇది కేవలం 25ms అల్ట్రా లో-లేటెన్సీని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా రియల్ టైమ్ సౌండ్ ఎఫెక్ట్స్ లభిస్తాయి. ఇది బ్లూటూత్ ద్వారా 10 మీటర్ల పరిధి వరకు ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అయి ఉంటుంది.

Save The Tigers Season 3 : జియోహాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ కొత్త సీజన్.. ఈసారి సోషియో ఫాంటసీ ట్విస్టుతో మోత

నాలుగు రకాల మల్టీ-కనెక్టివిటీ ఆప్షన్లు..
ఈ హెడ్‌సెట్ మరో అద్భుతమైన ఫీచర్ దీనికున్న మల్టీ-కనెక్టివిటీ సపోర్ట్. దీనిని ఒకేసారి నాలుగు రకాల డివైజ్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అదే పీసీ లేదా లాప్‌టాప్‌లలో గేమింగ్ ఆడటానికి వీలుగా యూఎస్‌బీ వైర్‌లెస్ కనెక్టివిటీ, 2.4GHz టైప్-సి వైర్‌లెస్ అడాప్టర్‌ను కూడా బాక్స్‌తో పాటు ఇస్తున్నారు. ఇవే కాకుండా, వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలనుకునే వారి కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉండటం విశేషం.

1000mAh భారీ బ్యాటరీ బ్యాకప్
వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ వాడేవారికి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ముఖ్యం. అందుకోసమే లెనోవో ఈ అరోరా జీహెచ్15 మోడల్‌లో ఏకంగా 1000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చింది. దీనివల్ల లాంగ్ గేమింగ్ సెషన్స్ ఆడేటప్పుడు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా గంటల పాటు ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడం కోసం అధునాతన యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung Galaxy S26 Ultra 5g: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.25,000 తగ్గిన గెలాక్సీ S26 అల్ట్రా ధర
  2. Ugreen HiTune S6 Pro: చెవుల నుంచి అస్సలు జారిపోవు..48 గంటల బ్యాట్రీ లైఫ్‌తో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్!
  3. Lenovo Aurora GH15 Gaming Headset launched: ఒక్క హెడ్‌ఫోన్.. నాలుగు కనెక్షన్లు.. మొబైల్, పిసి, టాబ్లెట్‌లకు ఈజీగా కనెక్ట్ అయ్యే లెనోవో అరోరా
  4. Smartphone Comparison : టెక్నో పోవా 8, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో వై400.. రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్..?
  5. Save The Tigers Season 3: జియోహాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ కొత్త సీజన్.. ఈసారి సోషియో ఫాంటసీ ట్విస్టుతో మోత!
  6. Discount on Oppo Reno 15C: ఒప్పో లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రేనో 15సీ స్మార్ట్‌ఫోన్
  7. IndiGo Airport Cab Service Starting at Just Rs 4: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 49 కే క్యాబ్ సర్వీస్ ప్రారంభించిన ఇండిగో
  8. Oneplus dual bluetooth audio: ఆపిల్, శామ్‌సంగ్ రేంజ్ ఫీచర్ ఇక వన్‌ప్లస్ ఫోన్లలో కూడా.. సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది
  9. iPhone 17 Pro Massive Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డీల్.. ట్రిపుల్ 48MP కెమెరాల ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్
  10. Jio AI: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »