Fast Charging : మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?.. ఫాస్ట్‎గా ఛార్జింగ్ అవ్వడానికి ఈ ట్రిక్స్ పాటించండి

ఫోన్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్, యూజర్ మ్యాన్యువల్ లేదా ఇంటర్నెట్‌లో ఫోన్ మోడల్ నంబర్ సెర్చ్ చేసి మీ ఫోన్ గరిష్టంగా ఎంత వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందో చెక్ చేయవచ్చు.

Fast Charging : మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?.. ఫాస్ట్‎గా ఛార్జింగ్ అవ్వడానికి ఈ ట్రిక్స్ పాటించండి

Photo Credit: Pexels/Stanley Ng

Fast Charging

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ యుగంలో సరికొత్త లైఫ్ హాక్స్
  • స్లో ఛార్జింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
  • సెకన్ల వ్యవధిలో నిండే బ్యాటరీ రహస్యం
ప్రకటన

Fast Charging : నేటి డిజిటల్ యుగంలో ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్ల ఫోన్ బ్యాటరీ రోజుకు నాలుగైదు సార్లు ఛార్జ్ చేయాల్సిన అవసరం వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది. ఛార్జింగ్ పెట్టే సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. మీ ఫోన్ బ్యాటరీ వేగంగా ఛార్జ్ కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అసలు సమస్య ఎక్కడ ఉందో వివరంగా తెలుసుకుందాం.

మొదట ఛార్జింగ్ కెపాసిటీ చెక్ చేయండి
మీ ఫోన్ అసలు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. దీనికోసం ఫోన్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్, యూజర్ మ్యాన్యువల్ లేదా ఇంటర్నెట్‌లో ఫోన్ మోడల్ నంబర్ సెర్చ్ చేసి మీ ఫోన్ గరిష్టంగా ఎంత వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందో చెక్ చేయవచ్చు. ఒకవేళ మీ ఫోన్ 33W లేదా 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసినప్పటికీ, మీరు తక్కువ పవర్ ఉన్న పాత ఛార్జర్ లేదా కేబుల్ ఉపయోగిస్తే ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ అవ్వదు. కాబట్టి ఫోన్ కెపాసిటీకి సరిపోయే సరైన పవర్ అడాప్టర్, కేబుల్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Redmi K100 Series : 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ.. త్వరలోనే రెడ్‌మి K100 సిరీస్ రాక

ఏం చేయాలి?  
వాల్ సాకెట్ మాత్రమే వాడండి: ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా ఇంట్లోని కరెంట్ స్విచ్ బోర్డ్‎కి ప్లగ్ చేసి మాత్రమే ఛార్జ్ చేయాలి.
* ఒరిజినల్ ఛార్జర్: ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్స్‌ను మాత్రమే వాడాలి. అడాప్టర్ పాడైతే అదే బ్రాండ్‌కు చెందిన ఆథరైజ్డ్ సెంటర్ల నుంచి కొత్తది కొనుగోలు చేయండి.
* బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి: ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్‌లో రన్ అవుతున్న యాప్‌లన్నింటినీ పూర్తిగా క్లోజ్ చేయండి.
* వైర్‌లెస్ ఫీచర్లు ఆఫ్ చేయండి: ఛార్జింగ్ సమయములో బ్లూటూత్, జీపీఎస్, వైఫై, మొబైల్ డేటాను ఆఫ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ వేగంగా ఎక్కుతుంది.

ఏం చేయకూడదు?  
* లాప్‌టాప్/పిసిలతో ఛార్జింగ్ వద్దు: లాప్‌టాప్ లేదా పవర్ బ్యాంక్‌లకు కేబుల్ తగిలించి ఛార్జింగ్ చేయడం వల్ల వోల్టేజ్ తక్కువగా వచ్చి ఛార్జింగ్ చాలా స్లో అవుతుంది.
* వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు: మీకు అత్యంత వేగంగా ఛార్జింగ్ కావాలనుకున్నప్పుడు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లపై ఫోన్ పెట్టకపోవడమే మంచిది.
* ఛార్జింగ్ పెట్టి వాడకండి: ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు గేమ్స్ ఆడటం, ఆడియో లేదా వీడియో కాల్స్ మాట్లాడటం, సోషల్ మీడియా వాడటం వంటివి అస్సలు చేయకూడదు.
* ఎక్కువ వేడి/చలి ప్రాంతాలు: అత్యధిక వేడి లేదా విపరీతమైన చల్లదనం ఉన్న ప్రాంతాల్లో ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టకూడదు.

ఈ జాగ్రత్తలన్నీ పాటించి, ఒరిజినల్ ఛార్జర్ వాడినప్పటికీ మీ ఫోన్ ఇంకా స్లోగానే ఛార్జ్ అవుతుంటే, ఒకసారి బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఛార్జింగ్ పోర్ట్ లేదా బ్యాటరీని చెక్ చేయించుకోవడం శ్రేయస్కరం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Airtel Vs Jio : జియోకు బిగ్ షాక్.. కొత్త కస్టమర్లలో నంబర్-1గా ఎయిర్‌టెల్
  2. Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో
  3. Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?
  4. Fast Charging : మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?.. ఫాస్ట్‎గా ఛార్జింగ్ అవ్వడానికి ఈ ట్రిక్స్ పాటించండి
  5. Redmi K100 Series : 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ.. త్వరలోనే రెడ్‌మి K100 సిరీస్ రాక
  6. OnePlus N6x : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x
  7. PM Modi : మోదీ సెల్ఫీ వీడియోల మ్యాజిక్.. ఇన్స్టాగ్రామ్‌లో 105 మిలియన్ల రికార్డు ఫాలోవర్స్
  8. Cyber Security : డిజిటల్ డేటాకు బిగ్ థ్రెట్.. క్వాంటమ్ కంప్యూటర్లతో డిజిటల్ ప్రపంచానికి ముప్పు నిజమేనా?
  9. Redmi Note 17 : త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 సిరీస్.. గ్లోబల్ లీక్స్ ద్వారా మోడళ్లు, ధరలు లీక్
  10. boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »