FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్

ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం ఈ స్థాయిలో పెరగడానికి గతేడాది ప్రవేశపెట్టిన యాన్యువల్ పాస్ స్కీమ్ ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది.

FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్

FASTag

ముఖ్యాంశాలు
  • రూ.3,075 లకే ఫాస్ట్‌ట్యాగ్ ఎన్యువల్ పాస్, ఎగిరిపోతున్న టోల్ ఛార్జీల భారం
  • ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు
  • దేశంలో 6.23 కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు
ప్రకటన

FASTag : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్ట్‌ట్యాగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లోక్‌సభలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలో ఆక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 6.23 కోట్లకు చేరుకుంది. ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి వాహనదారుడి నిత్య జీవితంలో ఇది ఒక కీలక భాగమైపోయింది.

యాన్యువల్ పాస్‌లకు పెరిగిన డిమాండ్ 
ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం ఈ స్థాయిలో పెరగడానికి గతేడాది ప్రవేశపెట్టిన యాన్యువల్ పాస్ స్కీమ్ ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాల కోసం ఈ ఎన్యువల్ పాస్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 77 లక్షలకు పైగా యాన్యువల్ పాస్‌లు జారీ కాగా, వీటి ద్వారా 63 కోట్ల టోల్ లావాదేవీలు నమోదయ్యాయి. నాన్-కమర్షియల్ వాహనాల కేటగిరీలో జరిగే మొత్తం డిజిటల్ టోల్ లావాదేవీలలో పాస్ హోల్డర్ల వాటానే 33 శాతంగా ఉంది. ఈ యాన్యువల్ పాస్ ధర రూ.3,075 గా ఉంది. తరచూ హైవేలపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారింది.

త్వరలోనే రాబోతున్న బ్యారియర్-ఫ్రీ టోల్లింగ్ సిస్టమ్
హైవేలపై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తర్వాతి తరం టోల్లింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ అని పిలుస్తారు. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే రహదారులపై ఫిజికల్ టోల్ బూత్‌లు లేదా గేట్లు ఉండవు. వాహనాలు ఎక్కడా ఆగకుండా, తమ సాధారణ స్పీడ్‌లోనే ప్రయాణిస్తూ టోల్ చెల్లించవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇంధనం కూడా బాగా ఆదా అవుతుంది.

Google Play Store : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి

ఏఐ టెక్నాలజీతో ఆటోమేటిక్ టోల్ కలెక్షన్ 
ఈ MLFF సిస్టమ్‌లో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. వాహనం గేటు దాటుతున్నప్పుడు కెమెరాలు నంబర్ ప్లేట్‌ను గుర్తించి, ఖాతా నుంచి టోల్ ఛార్జీని కట్ చేస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 టోల్ ప్లాజాలలో ఈ సిస్టమ్ ఏర్పాటుకు అనుమతులు లభించగా, ఇప్పటికే 5 ప్లాజాలలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం రెండు టోల్ ప్లాజాల మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉండాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉండవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ITR Filing : ఐటీఆర్ ప్రాసెస్ చాలా సింపుల్.. కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పూర్త్యయ్యేలా ఈజీ స్టెప్స్ ఇవే
  2. FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్
  3. Google Play Store : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
  4. Samsung Galaxy F70 Pro 5G : 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఆగస్టు 3న శాంసంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్
  5. HMD Pulse 2 Series : 5000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతున్న హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 సిరీస్
  6. Oppo K13 Turbo Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 టర్బో ప్రో 5G పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 12,000 కంటే ఎక్కువ ఆదా
  7. Smartphone Comparison : భారత మార్కెట్‌లోకి కొత్త వన్‌ప్లస్ N6x లాంచ్.. ఐకూ, రియల్‌మీ ఫోన్లకు గట్టి పోటీ
  8. Vivo X500 Pro : ప్రీమియమ్ లుక్, 144Hz డిస్‌ప్లే.. మైండ్ బ్లాక్ చేసే డిజైన్, ఫీచర్లతో వివో X500 ప్రో లీక్స్
  9. Lava Mobiles : లావా నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ల సేల్స్ షురూ.. రూ. 9 వేలకే అదిరిపోయే ఫీచర్లు
  10. OnePlus 16 : వన్ ప్లస్ లవర్స్‎కు పండగే.. OnePlus 16 లాంచ్ కన్‌ఫర్మ్, అదిరిపోయే ఫీచర్లతో టీజర్ రిలీజ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »