ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో అత్యంత కీలకమైన అంశం సరైన ఫారమ్‌ను ఎంచుకోవడం. మీ వార్షిక ఆదాయం, ఆదాయ వనరులను బట్టి ITR-1, ITR-2, ITR-3 లేదా ITR-4 లలో సరైనదాన్ని ఎంపిక చేసుకోవాలి.
Photo Credit: Unsplash/ Christine Hume
ITR Filing
ITR Filing : ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను భారీగా సందర్శిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కోట్లాది మంది ఇప్పటికే తమ రిటర్న్‌లను విజయవంతంగా సమర్పించారు. అయితే ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయని వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇంటి వద్ద నుంచే తమ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా కొన్ని నిమిషాల్లో ఐటీఆర్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో అత్యంత కీలకమైన అంశం సరైన ఫారమ్‌ను ఎంచుకోవడం. మీ వార్షిక ఆదాయం, ఆదాయ వనరులను బట్టి ITR-1, ITR-2, ITR-3 లేదా ITR-4 లలో సరైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు, లేదా ఇతర రకాల ఆదాయం ఉన్నవారు తమ కేటగిరీకి తగిన ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ పొరపాటున తప్పుడు ఫారమ్‌ను ఎంచుకుని సబ్మిట్ చేస్తే, పన్ను శాఖ నుంచి రీవర్క్ లేదా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఫారమ్ 16, AIS తో క్రాస్ చెక్ చేసుకోండి
రిటర్న్ సబ్మిట్ చేసే ముందు మీ ఆదాయం, టీడీఎస్, చెల్లించాల్సిన టాక్స్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఉద్యోగస్తులు తమ యాజమాన్యం ఇచ్చే ఫారమ్ 16తో పాటు ఐటీ పోర్టల్‌లోని యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లోని వివరాలను సరిచూసుకోవడం మంచిది. ఏవైనా బకాయిలు ఉంటే ముందే చెల్లించడం శ్రేయస్కరం. అలాగే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు న్యూ టాక్స్ రెజీమ్ డిఫాల్ట్‌గా ఉంటుంది, మీరు ఓల్డ్ టాక్స్ రెజీమ్ ఎంచుకోవాలనుకుంటే దాన్ని స్వయంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్
స్టెప్ బై స్టెప్: ఐటీఆర్ ఆన్లైన్లో ఫైల్ చేసే విధానం
* ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.
* e-File > Income Tax Return > File Income Tax Return ఆప్షన్‌ను ఎంచుకోండి.
* సంబంధిత అస్సెస్మెంట్ ఇయర్ (AY 2026-27) ని సెలెక్ట్ చేసుకోండి.
* ఫైలింగ్ మోడ్‌లో ఆన్లైన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
* మీ ఆదాయ రకానికి తగిన సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి.
* మీ ఆదాయ వివరాలు, టీడీఎస్, డిడక్షన్స్ సమగ్రంగా నమోదు చేయండి.
* వివరాలన్నీ చెక్ చేసి, ఏవైనా పన్ను బకాయిలు ఉంటే చెల్లించి Preview Return పై క్లిక్ చేయండి.
* అంతా సరిగ్గా ఉంటే సబ్మిట్ చేసి, ఆధార్ ఓటీపీ లేదా బ్యాంక్ ఖాతా ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయండి.
* ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నంబర్, ట్రాన్సాక్షన్ ఐడీ వస్తాయి, వీటితో మీ ఐటీఆర్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera