ఈ కొత్త అప్డేట్తో ఐపాడ్ OS యూజర్లు నేరుగా తమ ఐపాడ్లోనే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా కొత్త అకౌంట్‌ను ప్రారంభించవచ్చు.
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఐపాడ్ యూజర్ల కోసం ఒక బిగ్ అప్డేట్ను విడుదల చేసింది. ఇప్పటివరకుఐపాడ్లో వాట్సాప్ వాడాలంటే కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి, దాన్ని సెకండరీ డివైజ్‌గా మాత్రమే ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా, ఐపాడ్ లోనే నేరుగా కొత్త వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. అంటే ఇకపైఐపాడ్ను ఒక ప్రైమరీ డివైజ్‌గా వాడుకోవచ్చు. దీనికి తోడు మరికొన్ని అద్భుతమైన ఫీచర్లను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఐపాడ్లో డైరెక్ట్ సైన్అప్ ఫీచర్
ఇన్నాళ్లూ ఐపాడ్ యూజర్లు వాట్సాప్ వాడాలంటే మొదట ఫోన్లో అకౌంట్ ఉండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకండరీ డివైజ్‌గా కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఫోన్ అందుబాటులో లేకపోతే లేదా ఆఫ్ అయిపోతే తీవ్రబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఈ కొత్త అప్డేట్తో ఐపాడ్ OS యూజర్లు నేరుగా తమ ఐపాడ్లోనే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా కొత్త అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. దీనివల్ల ఫోన్‌తో సంబంధం లేకుండా ఐపాడ్లోనే స్వతంత్రంగా వాట్సాప్ సేవలను పొందవచ్చు.
వాట్సాప్ వెబ్‌లో పిడిఎఫ్ ఎడిటింగ్
ఐపాడ్ ఆప్షన్‌తో పాటు వాట్సాప్ డెస్క్‌టాప్, వాట్సాప్ వెబ్ యూజర్లకు మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను రోలౌట్ చేసింది. సాధారణంగా మనకు వాట్సాప్‌లో ఏదైనా పిడిఎఫ్ ఫైల్ వస్తే, దాన్ని చూడటానికి లేదా అందులో చిన్న చిన్న మార్పులు (ఎడిటింగ్) చేయడానికి ముందుగా సిస్టమ్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై డౌన్లోడ్ చేయాల్సిన పనిలేకుండా, నేరుగా వాట్సాప్ యాప్‌లోనే పిడిఎఫ్ ఫైల్స్‌ను ఓపెన్ చేసి ఎడిట్ లేదా మార్పులు చేసుకునే వెసులుబాటును తెచ్చింది. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతానికి మొబైల్స్ లేదాఐపాడ్లకు కాకుండా కేవలం డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్‌కే పరిమితం.
OPPO Find X10 : ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్
స్టేటస్ మ్యూజిక్, ఇన్-కార్ ఇన్ఫోటైన్మెంట్ సపోర్ట్
యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ జోడించే ఫీచర్‌ను విస్తరిస్తోంది. ఫోటోలు, వీడియోలతో పాటు నచ్చిన పాటలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించి స్టేటస్ పెట్టుకోవచ్చు. మరోవైపు కార్ల ప్రయాణికుల కోసం ఇన్ఫోటైన్మెంట్ సపోర్ట్‌ను కూడా మెరుగుపరిచింది. వాహనాల్లోని టచ్‌స్క్రీన్ ద్వారానే మెసేజ్ ప్రయాణాల్లో వాయిస్ కమాండ్స్ లేదా స్క్రీన్ పైనే మెసేజ్‌లు చూడటం, రిప్లై ఇవ్వడం, కాల్స్ మాట్లాడటం వంటివి సులభంగా చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన