Airtel Vs Jio : జియోకు బిగ్ షాక్.. కొత్త కస్టమర్లలో నంబర్-1గా ఎయిర్‌టెల్

జూన్ 2026 లో దేశవ్యాప్తంగా దాదాపు 53.8 లక్షల మంది (5,383,415) కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు.

Airtel Vs Jio : జియోకు బిగ్ షాక్.. కొత్త కస్టమర్లలో నంబర్-1గా ఎయిర్‌టెల్

Photo Credit: Pexels/Pascal

ముఖ్యాంశాలు
  • టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ మార్కెట్ జోరు
  • ట్రాయ్ లేటెస్ట్ డేటాతో షాక్‌లో టెలికాం రంగాలు
  • 50 కోట్ల దాటిన జియో సబ్‌స్క్రైబర్లు
ప్రకటన


Airtel Vs Jio :  భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఇటీవల జూన్ 2026 నెలకి సంబంధించిన టెలికాం సబ్‌స్క్రిప్షన్ నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం దేశంలో కొత్త మొబైల్ కస్టమర్లను ఆకర్షించడంలో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజ సంస్థ రిలయెన్స్ జియోను దాటుకుని ఎయిర్‌టెల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకోగా, మరొక ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ఎంటీఎన్‌ఎల్ మాత్రం యూజర్లను కోల్పోయింది.

ఎయిర్‌టెల్ వర్సెస్ జియో 
జూన్ 2026 లో దేశవ్యాప్తంగా దాదాపు 53.8 లక్షల మంది (5,383,415) కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇందులో అత్యధికంగా ఎయిర్‌టెల్ ఏకంగా 29.89 లక్షల (2,989,976) కంటే ఎక్కువ మంది కొత్త వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన రిలయెన్స్ జియో 21.46 లక్షల (2,146,980) కొత్త యూజర్లను పొందింది. ఆశ్చర్యకరంగా వొడాఫోన్ ఐడియా కూడా కోలుకుంటూ 1.63 లక్షల (163,757) మందిని, బిఎస్‌ఎన్‌ఎల్ 94,006 మంది కొత్త వైర్‌లెస్ కస్టమర్లను జోడించాయి. అయితే MTNL మాత్రం 11,284 మంది కస్టమర్లను కోల్పోయి నష్టాల్లో నిలిచింది.

మొత్తం మార్కెట్ షేర్ లో ఎవరు టాప్?
కొత్త కస్టమర్లలో ఎయిర్‌టెల్ టాప్‌లో ఉన్నప్పటికీ, దేశంలో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య,  మార్కెట్ షేర్ పరంగా రిలయెన్స్ జియోనే ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూన్ ముగిసే నాటికి జియో వద్ద 50.35 కోట్లు (503.58 మిలియన్లు) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో జియో మార్కెట్ వాటా 39.27 శాతంగా ఉంది. రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ 48.68 కోట్ల (486.80 మిలియన్లు) కస్టమర్లతో 37.96 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక వొడాఫోన్ ఐడియా 19.88 కోట్ల యూజర్లతో (15.50%) మూడో స్థానంలో, బిఎస్‌ఎన్‌ఎల్ 9.30 కోట్ల యూజర్లతో (7.25%) నాలుగో స్థానంలో ఉన్నాయి. దేశ వైర్‌లెస్ మార్కెట్‌లో ప్రైవేట్ ఆపరేటర్ల వాటా ఏకంగా 92.73 శాతంగా ఉండగా, ప్రభుత్వ సంస్థల వాటా 7.27 శాతానికి పరిమితమైంది.

Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో

5G FWA లో జియోదే ఆధిపత్యం
దేశంలో వైర్‌లెస్ టెలి-డెన్సిటీ మే నాటి 90.61% నుంచి జూన్ చివరి నాటికి 90.96% కి పెరిగింది. మరోవైపు 5G ఫైబర్/హోమ్ ఇంటర్నెట్ (5G FWA) విభాగంలో జియో ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ చివరి నాటికి దేశంలో మొత్తం 5G FWA సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.29 కోట్లకు (12.93 మిలియన్లు) చేరింది. ఇందులో రిలయెన్స్ జియో ఒక్క నెలలోనే 1.45 లక్షల మందిని చేర్చుకుని మొత్తం 91.14 లక్షల 5G FWA యూజర్లతో మొదటి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 56,773 మంది కొత్త సబ్‌స్క్రైబర్లతో మొత్తం 38.21 లక్షల FWA కస్టమర్లను కలిగి ఉంది. ఇక UBR FWA విభాగంలో జియో వద్ద జూన్ నాటికి 49.34 లక్షల మంది యూజర్లు ఉన్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Airtel Vs Jio : జియోకు బిగ్ షాక్.. కొత్త కస్టమర్లలో నంబర్-1గా ఎయిర్‌టెల్
  2. Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో
  3. Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?
  4. Fast Charging : మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?.. ఫాస్ట్‎గా ఛార్జింగ్ అవ్వడానికి ఈ ట్రిక్స్ పాటించండి
  5. Redmi K100 Series : 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ.. త్వరలోనే రెడ్‌మి K100 సిరీస్ రాక
  6. OnePlus N6x : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x
  7. PM Modi : మోదీ సెల్ఫీ వీడియోల మ్యాజిక్.. ఇన్స్టాగ్రామ్‌లో 105 మిలియన్ల రికార్డు ఫాలోవర్స్
  8. Cyber Security : డిజిటల్ డేటాకు బిగ్ థ్రెట్.. క్వాంటమ్ కంప్యూటర్లతో డిజిటల్ ప్రపంచానికి ముప్పు నిజమేనా?
  9. Redmi Note 17 : త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 సిరీస్.. గ్లోబల్ లీక్స్ ద్వారా మోడళ్లు, ధరలు లీక్
  10. boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »