చైనా మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన Oppo K12 Plus స్మార్ట్‌ఫోన్
చైనా మొబైల్ మార్కెట్‌లోకి ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో Oppo K12 Plus స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. Oppo నుంచి తాజాగా లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజీ సామర్థ్యంతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,400mAh బ్యాటరీని అందించారు. అలాగే, Oppo K12 Plus డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ హ్యాండ్‌సెట్ నాణ్యతపై ప్రచారంలో భాగంగా.. దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించింది