స్విమ్మింగ్ మోడ్‌తో మన దేశంలో అడుగుపెడుతోన్న Huawei Band 9 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే
ఇండియన్ మార్కెట్‌లోకి Huawei Band 9 వచ్చేందుకు సన్నద్దమైంది. ఇది జూలై 2024లో విడుదలైన Huawei Band 8కి కొనసాగింపుగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అడుగుపెట్టేందుకు నిశ్శబ్దంగా సిద్ధమైంది. ఈ స్మార్ట్ వేరబుల్ ఆల్వేస్-ఆన్-డిస్‌ప్లే (AOD) ఫీచర్‌కు సపోర్ట్ చేస్తూ, 2.5D AMOLED స్క్రీన్‌తో వస్తోంది. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, నిద్ర, ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, హార్ట్ బీట్ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. స్ట్రోక్స్, ల్యాప్స్, పెర్ఫార్మెన్స్ వంటి అనేక మెట్రిక్‌లను ట్రాక్ చేయడంతోపాటు స్విమ్మింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది