Jiohotstar

Jiohotstar - ख़बरें

  • రిలయన్స్ జియో రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు క్రికెట్ డేటా ప్యాక్‌
    త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రిలయన్స్ జియో స‌రికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప‌రిచ‌యం చేసింది. ముఖ్యంగా మ‌న దేశంలోని ICC మెన్స్‌ ఛాంపియన్స్ ట్రోఫీ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇది JioCinema, Disney+ Hotstar ల విలీనం త‌ర్వాత ఇటీవల లాంఛ్ చేసిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన JioHotstar కు ఉచిత subscription అందిస్తుంది. దీని వలన వినియోగదారులు ఇప్ప‌టికే మొద‌లైన క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సినిమాలు, షోలు, anime, డాక్యుమెంటరీలతోపాటు ఇతర లైవ్ క్రీడా కార్యక్రమాలను వీక్షించ‌వ‌చ్చు. అలాగే, ఇతర ప్రయోజనాలలో క్రికెట్ డేటా ప్యాక్ కూడా ఉంది.
  • తుడారుమ్ OTT రిలీజ్‌ అప్‌డేట్.. థియేటర్లలో విడుదల‌ తర్వాత ఎక్కడ చూడాలంటే..
    ప్రముఖ నటులు మోహన్ లాల్, శోభన నటించిన మలయాళ థ్రిల్లర్ మూవీ తుడారుమ్ ఈ ఏడాది మ‌ధ్య‌లో థియేటర్లలో విడుదల కానుంది. మొదటగా సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందని భావించినప్పటికీ, సినిమా విడుదల వాయిదా పడింది. జియో హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ముందుగానే ఖరారు చేశారని నివేదికలు చెబుతున్నాయి. అయితే, విడుదల ఆలస్యం వెనుక ఉన్న కారణాలపై ప‌లు ఊహాగానాలు ప్ర‌చార‌మ‌య్యాయి. OTT హక్కులు అమ్ముడవ్వ‌క పోకపోవడంతోనే వాయిదా పడిందని గతంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేద‌ని ప్రొడక్షన్ పేర్కొంది. కాంట్రాక్ట్ బాధ్య‌త‌ల‌తోపాటు, వ్యూహాత్మ‌కమైన నిర్ణ‌యాల కార‌ణంగానే ఆల‌స్యమైంద‌ని వెల్ల‌డించింది.
  • జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లాంఛ్‌
    రిలయన్స్ సంస్థ‌కు చెందిన‌ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి రూపొందించిన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను జియోస్టార్ లాంఛ్ చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ ప్లాట్‌ఫామ్ రెండు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌ల మొత్తం కంటెంట్ లైబ్రరీని హోస్ట్ చేస్తుంది. తాజాగా, ఈ రెండు విలీన సంస్థల నుండి షోలు, సినిమాలతో పాటు, వివిధ అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుండి కంటెంట్‌ను కూడా హోస్ట్ చేస్తుంది. జాయింట్ వెంచర్ స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ కోసం ఫ్రీ టైర్‌ కూడా ప్రకటించింది. ముఖ్యంగా, వయాకామ్ 18, స్టార్ ఇండియా విజయవంతమైన విలీనం తర్వాత నవంబర్ 2024లో జియోస్టార్ జాయింట్ వెంచర్ ఏర్పడింది.

Jiohotstar - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »