ఫిబ్రవరి మూడవ వారంలో లాంచ్ కానున్న Oppo Find N5 హ్యాండ్‌సెట్
చైనాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో Oppo Find N5 ఫోన్ లాంఛ్ కాబోతున్నట్లు స్పష్టమైంది. ఈ నెల మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ ఈవెంట్ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని Oppo ఇంకా ప్రకటించలేదు. బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో దీనిని అందించవచ్చని భావిస్తున్నారు. Oppo Find N5 ఫోన్‌ను Oppo Find N3కి కొనసాగింపుగా Oppo వాచ్ X2 స్మార్ట్‌వాచ్‌తో పాటు కంపెనీ పరిచయం చేయనుంది.