భారత్‌లో డిసెంబర్ 9న Redmi Note 14 5G లాంచ్.. కొనుగోలుకు అమెజాన్‌లో అవకాశం
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో Redmi Note 14 5G డిసెంబర్ 9న Redmi Note 14 Pro+, Redmi Note 14 Proతో పాటు లాంచ్ కానుంది. ఈ లైనప్ చైనాలో సెప్టెంబరులో దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 రేటింగ్‌తో విడుదలైంది. ఇండియన్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లు చైనీస్ కౌంటర్‌పార్ట్‌లను పోలి ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఇండియాలో లాంచ్‌కు ముందు అమెజాన్ బేస్ Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ లభ్యతతోపాటు కీలకమైన ఫీచర్స్, కలర్ ఆప్షన్‌లను వెల్లడించింది