రిలయన్స్ జియో రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు క్రికెట్ డేటా ప్యాక్
తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా మన దేశంలోని ICC మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది JioCinema, Disney+ Hotstar ల విలీనం తర్వాత ఇటీవల లాంఛ్ చేసిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన JioHotstar కు ఉచిత subscription అందిస్తుంది. దీని వలన వినియోగదారులు ఇప్పటికే మొదలైన క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సినిమాలు, షోలు, anime, డాక్యుమెంటరీలతోపాటు ఇతర లైవ్ క్రీడా కార్యక్రమాలను వీక్షించవచ్చు. అలాగే, ఇతర ప్రయోజనాలలో క్రికెట్ డేటా ప్యాక్ కూడా ఉంది.