కస్టమర్ల ప్రైవసీని కాపాడటానికి UPI యాప్‌లు, బ్యాంకులకు NPCI ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Photo Credit: Unsplash/ David Dvoracek
UPI
UPI Privacy : దేశంలో డిజిటల్ పేమెంట్లు వాడుతున్న కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలకు మరింత భద్రత కల్పించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం కింద, అన్ని ప్రముఖ UPI యాప్‌లు (Google Pay, PhonePe, Paytm వంటివి), భాగస్వామ్య బ్యాంకులతో కలిసి అవసరమైన మార్పులు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం పేమెంట్స్ చేసే సమయంలో యూజర్ల మొబైల్ నంబర్లు, బ్యాంక్ వివరాలు ఇతరులకు కనబడకుండా చేయడం, డేటా చోరీని అరికట్టడమే.
మొబైల్ నంబర్లకు మాస్కింగ్
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. కస్టమర్ల ప్రైవసీని కాపాడటానికి UPI యాప్‌లు, బ్యాంకులకు NPCI ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా యూపీఐ వ్యవస్థలో లావాదేవీలు చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి ఫోన్ నంబర్ కీలకంగా మారింది. అయితే దీనివల్ల వ్యక్తిగత నంబర్లు ఇతరులకు తెలిసిపోతున్నాయి. దీనికి చెక్ పెడుతూ, ఇకపై కస్టమర్ ఇంటర్ఫేస్, కమ్యూనికేషన్లో యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లను మాస్క్ చేయాలని ఆదేశించింది. కొత్త నియమం ప్రకారం ఎదుటి యూజర్‌కి మీ ఫోన్ నంబర్లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
క్యూఆర్ కోడ్ పేమెంట్లలోనూ సేఫ్టీ
దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేసిన తర్వాత కూడా, స్వీకరించే యాప్‌లలో వినియోగదారుల పూర్తి ఫోన్ నంబర్ కనిపించకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ మార్పులను తమ సిస్టమ్‌లలో అమలు చేయడానికి బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు NPCI సెప్టెంబర్ 4వ తేదీని గడువుగా (డెడ్‌లైన్) నిర్ణయించింది. ఈ గడువు నాటికి అన్ని యాప్‌లు కస్టమర్ ఫేసింగ్ ఇంటర్ఫేస్ను పూర్తిగా ప్రైవసీ ఫ్రెండ్లీగా మార్చాల్సి ఉంటుంది.
Lyne Blaster Series : మైక్ ఉచితం, లైటింగ్ అదుర్స్..రూ. 1,999 లకే లైన్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్పీకర్
యూజర్‌నేమ్ ఆధారిత UPI ID లకు ప్రమోషన్
దీనితో పాటు, ఫోన్ నంబర్‌ను VPA (వర్చువల్ పేమెంట్ అడ్రస్) గా ఉపయోగించే పద్ధతిని తగ్గించాలని NPCI భావిస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్ స్థానంలో Username ఆధారిత UPI ID (ఉదాహరణకు: Rahul@upi) ని క్రియేట్ చేసుకుని, దాన్నే డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉపయోగించే వెసులుబాటు కల్పించాలని యాప్‌లను కోరింది. ప్రస్తుతం కొత్తగా యూపీఐ రిజిస్టర్ చేసుకునే వారిలో ఎక్కువమంది ఫోన్ నంబర్‌నే ఐడీగా ఎంచుకుంటున్నారు. కానీ Username ఐడీలపై అవగాహన పెంచడం ద్వారా ప్రైవసీ సమస్యలను పూర్తిగా తొలగించవచ్చని భావిస్తున్నారు.
ప్రైవసీలో సరికొత్త అధ్యాయం
యూపీఐ లావాదేవీలు సురక్షితమే అయినప్పటికీ, ఫోన్ నంబర్లు బహిర్గతం కావడం వల్ల స్పామ్ కాల్స్, ప్రైవసీ ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉండేది. NPCI తీసుకొస్తున్న ఈ కొత్త మార్పుల వల్ల సాధారణ కస్టమర్లకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. సెప్టెంబర్ 4 తర్వాత డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారనున్నాయి.
ప్రకటన
ప్రకటన