పట్టణాలు, నగరాలే కాకుండా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ పౌరులు సైతం 5G నెట్‌వర్క్‌ను సజావుగా ఉపయోగించుకోగలుగుతున్నారు.
Photo Credit: Pexels/Z z
Digital India
Digital India : భారతదేశంలో డిజిటల్ విప్లవం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మూలమూలకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరవేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం దేశంలోని 99.9 శాతం జిల్లాల్లో ప్రజలకు ఫాస్టెస్ట్ 5G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణాలు, నగరాలే కాకుండా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ పౌరులు సైతం 5G నెట్‌వర్క్‌ను సజావుగా ఉపయోగించుకోగలుగుతున్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన 5G టవర్లు
కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరిగింది. మార్చి 31, 2023 నాటికి దేశంలో కేవలం 1,40,623 గా ఉన్న 5G బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల సంఖ్య, జూన్ 30, 2026 నాటికి ఏకంగా 5,62,971కి చేరుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇన్ని లక్షల టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 99.9 శాతం జిల్లాలకు ఈ అధునాతన నెట్‌వర్క్ సేవలు విస్తరించాయి.
పల్లె పల్లెకూ చేరుకున్న 4G కనెక్టివిటీ
కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిజిటల్ భారత్ నిధి(DBN) ద్వారా నిధులు పొందుతున్న 4G శాచురేషన్ ప్రాజెక్ట్, ఇతర మొబైల్ కనెక్టివిటీ పథకాల కింద జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 24 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. గతంలో అసలు ఎటువంటి నెట్‌వర్క్ సౌకర్యం లేని దట్టమైన అటవీ, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇప్పుడు 4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది.
Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే టీటీడీఎఫ్ పథకం
టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (TTDF) పథకం ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ పథకం కింద జూన్ 30, 2026 నాటికి సుమారు 136 వినూత్న ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 5.43 బిలియన్ల (రూ.543 కోట్లు) నిధులను మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా 6G టెక్నాలజీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ నెట్‌వర్క్స్, ఆప్టికల్ సిస్టమ్స్, స్వదేశీ 5G కోర్, టెలికాం సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
భారత్‌లో 6G సేవలకు స్ట్రాంగ్ పునాది
భవిష్యత్తు టెక్నాలజీతో భారత్‌ను ప్రపంచ స్థాయి విజేతగా నిలిపేందుకు మార్చి 2023లోనే ప్రభుత్వం భారత్ 6G విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సురక్షితమైన, ఇంటిలిజెంట్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా 6G టెక్నాలజీని ఇక్కడే డిజైన్ చేసి, అభివృద్ధి చేసి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, దేశీయంగా టెలికాం ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు టెలికాం శాఖ రూ. 121.95 బిలియన్ల (రూ. 12,195 కోట్లు) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
WhatsApp Adds Status Caption Editing Feature for Android Beta Testers: Report