Coloros 15

Coloros 15 - ख़बरें

  • మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G
    చైనాలో అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఇండియా మార్కెట్‌లోకి Oppo Reno 13 5G, Reno 13 Pro 5Gలు విడుదల అయ్యాయి. ఈ కొత్త Reno సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర‌పై ర‌న్ అవుతాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి. Oppo Reno 13 Pro 5Gలో సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అయితే, వెనిల్లా మోడల్‌లో మాత్రం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇవి రెండూ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి
  • Oppo Reno 13, Reno 13 Proల‌తోపాటు మ‌రో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి వ‌చ్చేస్తున్నాయి..
    గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో Oppo Reno 13, Reno 13 Pro హ్యాండ్‌సెట్‌లు చైనాలో విడుద‌లైన త‌ర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ గ్లోబల్ లాంచ్‌తో పాటు Oppo Reno 13F 5G, Reno 13F 4G అనే రెండు కొత్త వేరియంట్‌లు కూడా వ‌స్తున్నాయి. Oppo Reno 13F వేరియంట్‌లలో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌, 45W వైర్డు SuperVOOC ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 5,800mAh బ్యాటరీల‌ను అందించారు. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్న‌ట్లు కంపెనీ చెబుతోంది
  • చైనా మార్కెట్‌లోకి OnePlus Ace 5 Pro, OnePlus Ace 5లు వ‌చ్చేశాయి.. ధ‌ర ఎంతంటే
    చైనాలో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ కొత్త OnePlus Ace సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజీతో వ‌స్తున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుండ‌గా, Ace 5 మోడ‌ల్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండూ చైనాలో కొనుగోలు చేసేందుకు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయి
  • AI ఫీచర్లతో Oppo, OnePlus ఫోన్‌ల కోసం ColorOS 15 వ‌చ్చేసింది
    Oppo, OnePlus స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ColorOS 15ను ఆవిష్కరించారు. ఈ తాజా Android 15 ఆధారంగా మెరుగైన మోష‌న్ ఎఫెక్ట్‌తోపాటు స్ప‌ష్ట‌మైన‌ యానిమేషన్‌లు, కొత్త థీమ్‌ల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది O+ ఇంటర్‌కనెక్షన్ యాప్ స‌హ‌కారంతో Oppo, iPhone మోడల్‌ల మధ్య సులభంగా ఫైల్స్‌ ట్రాన్స్‌ఫ‌ర్‌కు స‌పోర్ట్ చేస్తుంది. ColorOS 15 దీని Xiaobu అసిస్టెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లకు స‌పోర్ట్ చేయ‌డం ద్వారా వినియోగదారులు దాని ఆన్-స్క్రీన్ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవడంతో పాటు సాధార‌ణ‌ బాష‌లో సంభాషణలను కొన‌సాగించ‌వ‌చ్చు

Coloros 15 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »