రిలయన్స్ జియో రూ. 2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్.. అదిరిపోయే ప్రయోజనాలు పొందండి
భారత్‌లోని రిలయన్స్ జియో తమ నెట్‌వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ దేశంలో అపరిమిత వాయిస్ కాల్స్, SMS సేవలతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇది చందాదారులకు రూ. 2150 విలువైన అదనపు ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఇస్తుంది. షాపింగ్ వెబ్‌సైట్‌లు, ఫుడ్ డెలివరీ యాప్‌లతోపాటు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లపైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా రూ.400 మొత్తాన్ని వినియోగదారుల వార్షిక పొదుపుగా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్‌లను పొందేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులు 2025, జనవరి 11వ తేదీలోగా రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది