GeekBenchలో Motorola Razr 50s ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
ఇటీవలే Motorola నుంచి Razr 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కంపెనీ Motorola Razr 50s ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించాయి. దీని ప్రాసెసర్, RAMతోపాటు మరిన్ని వివరాలు బయటకొస్తున్నాయి. అలాంటి నివేదికల ఆధారంగా 8GB RAM వేరియంట్ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని కలిగి ఉన్నట్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, Motorola Razr 50s కూడా ఇటీవల HDR10+ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది