ట్రాన్పరెంట్ డిజైన్‌తో రాబోయే తమ స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసిన Nothing కంపెనీ
Nothing Phone 2కి కొనసాగింపుగా రాబోయే నెలల్లో సరి కొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు పెద్ద ఎత్తున కంపెనీ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ UK-ఆధారిత Original Equipment Manufacturer (OEM) తన సోషల్ మీడియా పేజీ ద్వారా రాబోయే ప్రొడక్ట్‌ను మరోసారి టీజ్ చేసింది. ఇది రాబోయే తదుపరి స్మార్ట్ ఫోన్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ట్రాన్సపరెంట్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ డిజైన్ ఇటీవల కాలంలో కంపెనీ నుంచి వస్తోన్న ఫోన్‌లకు తప్పనిసరి అనేలా వస్తోందనే చెప్పాలి.