Get XElectron Projector @Rs 6,990: రూ.6,990కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్

XElectron Techno C7 Smart HD Projector Launched in India at Rs 6,990 only: ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 ప్రొజెక్టర్ హెచ్‌డీ (1280×720 పిక్సెల్స్) నేటివ్ రెసొల్యూషన్‌తో పనిచేస్తుంది.

Get XElectron Projector @Rs 6,990: రూ.6,990కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్

Photo Credit: XElectron

XElectron Techno C7 Smart Home Theatre Projector

ముఖ్యాంశాలు
  • రూ. 6,990 కే ఇంటి వద్ద థియేటర్ ఎక్స్‌పీరియన్స్
  • 180 డిగ్రీల రొటేషన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో కొత్త ప్రొజెక్టర్
  • ఎక్స్‌ఎలెక్ట్రాన్ నుంచి కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్
ప్రకటన

XElectron Techno C7 Smart HD Projector Launched in India at Rs 6,990: తక్కువ బడ్జెట్‌లో ఇంటి వద్దే థియేటర్ వంటి అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే ఆడియో, వీడియో ప్రియుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎక్స్‌ఎలెక్ట్రాన్ ఒక సూపర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో కొత్తగా  టెక్నో సి7 స్మార్ట్ హోమ్ థియేటర్ మూవీ హెచ్‌డీ ప్రొజెక్టర్‎ను లాంచ్ చేసింది. అదనపు స్టాండ్‌లు లేదా ఫైర్ టీవీ స్టిక్ వంటి స్ట్రీమింగ్ పరికరాలు ఏవీ లేకుండానే.. నేరుగా పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రొజెక్టర్‌ను రూపొందించారు.  

డిస్‌ప్లే క్లారిటీ, స్క్రీన్ సైజు వివరాలు..

ఈ ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 ప్రొజెక్టర్ హెచ్‌డీ (1280×720 పిక్సెల్స్) నేటివ్ రెసొల్యూషన్‌తో పనిచేస్తుంది. అయినప్పటికీ, ఇది 1080p Full HD, 4K కంటెంట్‌ను సులువుగా ప్లే చేయగలదు. ప్రొజెక్టర్‌లో 9000 ల్యూమెన్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 5000:1 కాంట్రాస్ట్ రేషియో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అమర్చిన ఎల్‌ఈడీ లైట్ సోర్స్ దాదాపు 50,000 గంటల లైఫ్ టైమ్‌ను ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది 4 అడుగుల నుంచి 16 అడుగుల దూరం నుంచి 40 ఇంచుల నుంచి ఏకంగా 200 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదు. అయితే బెస్ట్ వ్యూ అనుభవం కోసం 120 ఇంచుల స్క్రీన్ సైజు అత్యంత అనుకూలమని కంపెనీ రికమండ్ చేస్తోంది.  

180 డిగ్రీల రొటేటింగ్ డిజైన్, స్మార్ట్ అడ్జస్ట్‌మెంట్స్..

ఈ ప్రొజెక్టర్‌లోని ప్రధాన ఆకర్షణ దీని ఇన్-బిల్ట్ 180 డిగ్రీల రొటేటింగ్ స్టాండ్. దీని సాయంతో వినియోగదారులు ప్రొజెక్టర్‌ను గోడపైకే కాకుండా, నేరుగా పడుకుని సీలింగ్  వైపు తిప్పి కూడా సినిమాలు చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ట్రైపాడ్ లేదా సీలింగ్ మౌంట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్, 4D కీస్టోన్ కరెక్షన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండటం వల్ల.. ప్రొజెక్టర్‌ను ఏ కోణంలో ఉంచినా చిత్రం ఆటోమేటిక్‌గా నేరుగా, స్పష్టంగా అడ్జస్ట్ అవుతుంది.  

Air Taxi e200X : ట్రాఫిక్‌కు బై బై.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ టాక్సీ

ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఇన్-బిల్ట్ ఓటీటీ యాప్స్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ప్రొజెక్టర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనివల్ల ఫైర్ టీవీ స్టిక్ లేదా ఆండ్రాయిడ్ బాక్స్ వంటి ఇతర కనెక్టింగ్ డివైజ్‌ల అవసరం లేకుండానే నేరుగా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను రన్ చేసుకోవచ్చు. అలాగే దీని ఇంటర్‌ఫేస్ హిందీ, బెంగాలీ వంటి భారతీయ భాషలతో సహా మొత్తం 25 గ్లోబల్ లాంగ్వేజ్‌లకు సపోర్ట్ ఇస్తుంది.  

కనెక్టివిటీ, ఆడియో, ధర..

కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్-బ్యాండ్ వైఫై 6, బ్లూటూత్ 5.0 సాంకేతికతను ఇచ్చారు. ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్ లేదా పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయడానికి ఎఫ్‌డిఎమ్‌ఐ పోర్ట్, యుఎస్‌బి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ అందుబాటులో ఉన్నాయి. ఆడియో అవుట్‌పుట్ కోసం ఇందులో 20W ఇన్-బిల్ట్ స్పీకర్ సెటప్ ఉండగా, అవసరమైతే ఎక్స్‌టర్నల్ స్పీకర్లను బ్లూటూత్ ద్వారా జత చేసుకోవచ్చు. భారత్‌లో ఈ ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో సి7 ప్రొజెక్టర్ ప్రారంభ ధరను రూ. 6,990 గా నిర్ణయించారు. అమేజాన్ ఇండియా మరియు కంపెనీ అధికారిక రీటైల్ ఛానెళ్ల ద్వారా 1 సంవత్సరం మ్యానుఫ్యాక్చరర్ వారంటీతో దీనిని కొనుగోలు చేయవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  2. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  3. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  4. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  5. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  6. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  7. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
  8. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  9. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  10. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »