Amazon Great Indian Festival 2024

Amazon Great Indian Festival 2024 - ख़बरें

  • ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ 2024లో ప్రింటర్‌లపై క‌ళ్ల చెదిరే డీల్స్.. ఇదిగో ఆ లిస్ట్‌
    ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 అన్ని వర్గాల కొనుగోలుదారుల‌నూ ఆక‌ర్షించేలా ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ పండగల సీజన్‌లో మంచి త‌గ్గింపు ధ‌ర‌లో ప్రింటర్‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి Amazon స‌రికొత్త ఆఫ‌ర్‌ల‌ను ఇస్తోంది. అత్యుత్తమ ప్రింటర్ డీల్‌లను పొందడానికి ఇదో గొప్ప వేదిక అనే చెప్పాలి. ఈ ఈ-కామర్స్ దిగ్గజం ప్రస్తుతం HP, Canon, Brother, Epson లాంటి మ‌రెన్నో ప్రముఖ బ్రాండ్‌ల ప్రింటర్‌లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. కాబట్టి, మీరు మీ ఇంటి కోస‌మో లేదా ఆఫీస్ కోస‌మో కొత్త ప్రింటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ల‌భిస్తోన్న ఈ ఆఫ‌ర్‌ల లిస్ట్ ఆస్స‌లు మిస్స‌వ్వొద్దు!
  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. లక్ష లోపు టాప్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల లిస్ట్‌ మీకోసం
    Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తమకు అవ‌స‌ర‌మైన‌ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాల‌నుకునేవారికి గొప్ప వేదిక అని చెప్పొచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాల లాంటి అనేక వస్తువులపై ర‌క‌రకాల డిస్కౌంట్‌, డీల్‌లను అందిస్తోంది. ఈ ప్రొడ‌క్ట్స్‌పై ఎక్కువ ఖ‌ర్చు చేయ‌కుండా కొనుగోలుదారుల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు సొంతం చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇక్క‌డ మీకోసం Amazon సేల్‌లో రూ. 50 వేల నుంచి రూ. ల‌క్ష‌లోపు ధ‌ర ఉండే బెస్డ్ బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్ డీల్‌ల లిస్ట్‌ను రూపొందించాం. ఈ జాబితాలో Acer, Asus, Dell, HP లాంటి టాప్‌ కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయి. అలాగే, మీరు PC బిల్డ్‌పై ఎక్క‌వ‌ మొత్తంలో ఖర్చు చేయకూడదనుకునే గేమర్ అయినా, పవర్‌హౌస్‌గా కూడా ఉండే పోర్టబుల్ ప్రొడ‌క్ట్‌ను కోరుకున్నా ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం రూ. ల‌క్ష‌ లోపు కొన్ని బెస్ట్‌ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై గొప్ప ఆఫర్‌లను ప్రవేశపెట్టింది
  • Apple నుంచి OnePlus వ‌ర‌కూ స్మార్ట్‌వాచ్‌లపై Amazon ఆఫ‌ర్స్ లిస్ట్ ఇదే
    ప్ర‌స్తుతం వినియోగిస్తున్న గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వినియోగ‌దారుల‌కు Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ స‌రైన స‌మ‌య‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే, ఈ సేల్‌లో ప్ర‌త్యేక‌మైన ఆఫర్‌ల ప్రయోజనాల‌తోపాటు కోరుకున్న ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు పొందొచ్చు. అందుకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో మీరు కొనుగోలు చేయగల టాప్ ప్రీమియం హెడ్‌ఫోన్‌లు కూడా భారీ డిస్కౌంట్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయడం మీ మనసులో ఉంటే ఈ సేల్ మీకు స‌రైన వేదిక‌లాంటిది. బ్రాండెడ్ ఉత్ప‌త్తుల‌పై వ‌చ్చే డిస్కౌంట్లు, బ్యాంక్ ప్రయోజనాలను ఇక్క‌డ‌ తెలుసుకుందాం
  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స‌గం ధ‌ర‌కే వ‌చ్చే బ్రాండెడ్‌ స్మార్ట్‌టీవీల లిస్ట్ ఇదే
    వివిధ ర‌కాల ఉత్పత్తుల‌పై Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోంది. రాబోయే పండుగకు ఇంటికి కావాల్సిన ఉప‌క‌ర‌ణాల‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. Amazon ప్రస్తుతం Samsung, LG, TCL, Sony, Toshiba, Hisense లాంటి మరెన్నో ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌టీవీల‌పై 65శాతం వరకు డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌ను అందిస్తోంది
  • త‌గ్గింపు ధ‌ర‌ల్లో స‌్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లోనే కొనండి
    మ‌న‌దేశంలోని ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబ‌ర్ 26న‌ ప్రారంభమైన విష‌యం తెలిసిందే. అలాగే, సెప్టెంబర్ 27న ఉదయం 12 గంటల నుండి మిగిలిన‌వారంద‌రికీ ఈ సేల్ అందుబాటులోకి వ‌చ్చింది. మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం షాపింగ్ చేయాల‌నుకుంటే మాత్రం ఈ సేల్ మీకు స‌రైన వేదిక అవుతుంద‌ని చెప్పొచ్చు. మ‌రీ ముఖ్యంగా మీరు iOS కంటే Androidని ఇష్టపడితే ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు మీకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి
  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌.. రూ.20 వేలులోపు స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ డీల్స్ ఇవే
    భార‌త్‌లో Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ గొప్ప‌గా ప్రారంభమైంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతోస‌హా అనేక రకాల వస్తువులపై క‌ళ్లుచెదిరే డీల్‌లు, ఆఫర్‌లను పరిచయం చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు 40 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన డీల్‌లలో ఒకటిగా iPhone 13 గురించి చెప్పుకోవాలి. దీనిని అన్ని ఆఫ‌ర్‌లు క‌లుపుకొని కేల‌వం రూ. 40,499ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు
  • Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో ఈ ఫోన్‌లు, ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై క‌ళ్లు చెదిరే డిస్కౌంట్‌
    Amazon ప్రైమ్ మెంబర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను అందించిన 24 గంటల తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ అందరి కోసం ప్రారంభమైంది. ఈ పండుగ సీజన్ స్పెషల్ సేల్ ఈవెంట్ బ్రాండెడ్‌ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ పరికరాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్ప‌త్తులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. అయితే, Amazon అందిస్తోన్న‌ వందల కొద్దీ డీల్‌లను మీకు ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. సేల్‌ సమయంలో ధరలలో మార్పులు ఉండ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు
  • క‌ళ్లు చెదిరే డిల్స్‌తో స్టార్ట్ అయింది.. Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024
    ప్ర‌ముఖ ఈ-కామర్స్ దిగ్గజం Amazon వార్షిక సేల్ ఈవెంట్ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సంద‌డి మొద‌లైంది. ప్రతి సంవత్సరం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర కస్టమర్‌ల కంటే ఒక రోజు ముందుగా Amazon ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ డీల్‌లను వినియోగదారులకు అందిస్తుంది. దీంతో వారికి 24 గంటల ముందే సేల్ ప్రారంభ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం కొనసాగుతున్న Amazon సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుండి గృహోపకరణాల వరకు అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు ఉన్నాయి. అంతేకాదు, కస్టమర్‌లు అనేక రకాల ఉత్పత్తులపై అదనపు తగ్గింపును పొందేందుకు లేదా పాత ఉత్పత్తులను మార్పిడి చేసుకునే క్ర‌మంలో వారి కొనుగోళ్ల ధరను తగ్గించడానికి SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా ఉపయోగించవచ్చు
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ 2024
    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ సంస్థ రాబోయే పండ‌గ సీజ‌న్‌కు ముందే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. అయితే, ఖచ్చితమైన తేదీలు ఇంకా వెల్లడించ‌నప్పటికీ, అమెజాన్ తమ‌ వెబ్‌సైట్‌లో కొన్ని డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌ను టీజ్ చేసింది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్ మరియు గృహ‌ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును పొంద‌వ‌చ్చు. అలాగే, ప్రైమ్ సభ్యులు, SBI కార్డ్ వినియోగదారులకు అద‌న‌పు ప్రయోజనాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ చివ‌రిలో అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ 2024 ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి

Amazon Great Indian Festival 2024 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »