డిసెంబర్ 16న Lava Blaze Duo ఇండియాలో లాంచ్.. డిజైన్‌తోపాటు కీలక ఫీచర్లు వచ్చేశాయి
త్వరలోనే Lava Blaze Duo స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే, కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని వెల్లడించింది. అలాగే, ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్‌తోపాటు కీలకమైన స్పెసిఫికేషన్స్‌ను ప్రకటించింది. త్వరలో రాబోయే స్మార్ట్ ఫోన్ RAM వేరియంట్‌లతోపాటు డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, OSల పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ అక్టోబరు నెలలో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయిన Lava Agni 3 మోడల్ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ పోలి ఉండేలా వెనుక ప్యానెల్‌పై అమర్చిన సెకండరీ డిస్‌ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది