ఇక అన్ని రైలు సేవలూ ఒకే చోట.. స్వరైల్ సూపర్ యాప్‌ను ప్రారంభించిన భారతీయ రైల్వే
భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్వరైల్ పేరుతో ఓ సరికొత్త సూపర్ యాప్‌ను ప్రారంభించింది. రిజర్వ్ టికెట్ బుకింగ్, రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడం, PNR ఎంక్వైరీలు వంటి పబ్లిక్ ఫేసింగ్ సర్వీసులు అందించేందుకు ఇది వన్-స్టాప్ షాప్‌గా పరిచయం చేయబడింది. ప్రస్తుతం బీటాలో Android, iOS ప్లాట్‌ఫారమ్‌లకు మాత్రమే పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంది. స్వరైల్ సూపర్ యాప్ ద్వారా ప్రస్తుతం ఫోన్‌లో రైల్వే సేవల కోసం వినియోగిస్తున్న అనేక యాప్‌ల అవసరం లేకుండా, అన్ని సర్వీసులూ ఒకే చోట అందించడమే లక్ష్యంగా దీనిని రైల్వే శాఖ పరిచయం చేసింది.