జియో బంపర్ ఆఫర్.. 90 రోజుల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, జియో ఎయిర్ ఫైబర్ సేవలు
ఇండియాలో రాబోయే క్రికెట్ సీజన్‌కు ముందు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై రిలయన్స్ జియో బంపర్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఈ టెలికాం ప్రొవైడర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను, దీని వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవైన జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రకటనతో జియో వినియోగదారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి రాబోయే క్రికెట్ మ్యాచ్‌లను, ఇతర సినిమాలు, షోలు, అనిమే, డాక్యుమెంటరీలను వారి మొబైల్, టీవీలో 4Kలో చూసేందుకు అవకాశం ఉంటుంది.