లాంచ్‌కు ముందే TUV రైన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన Galaxy A56, Galaxy A36, Galaxy A26
గత వారం జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ Galaxy S25 సిరీస్‌ను ఆవిష్కరించిన తర్వాత, Samsung త్వరలో మరో మూడు స్మార్ట్ ఫోన్‌ల విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి బలం చేకూర్చేలా.. Galaxy A56, Galaxy A36, Galaxy A26 అనే ఫోన్‌లు తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్‌ల అరంగేట్రంపై చర్చకు దారితీసింది. అంతేకాదు, ఈ లిస్ట్‌లోని మూడు మోడళ్ల ఛార్జింగ్ కెపాసిటీపై కూడా మార్కెట్ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. Galaxy A56, Galaxy A36లు ఇటీవలి ఫ్లాగ్‌షిప్ S-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే అదే వేగవంతమైన వైర్డు ఛార్జింగ్ సామర్థ్యానికి సపోర్ట్ చేయవచ్చని అంచనా.