Google

Google - ख़बरें

  • ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో
    ఒక నివేదిక ప్ర‌కారం.. ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో అవతరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో ప‌రిచ‌య‌మైంది. అలాగే, ఇది ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతోంది. అయితే, HMD పల్స్ ప్రో కోసం తాజా Android 15 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వ‌ర్కింగ్‌ బూస్ట్, అడాప్టివ్ బ్యాటరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రైవ‌సీ లాంటి ఫీచర్లను తీసుకువస్తుందని వెల్ల‌డైంది. అలాగే, ఇందులో సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు, లేటెస్ట్‌ నోటిఫికేషన్ కంట్రోల్ సిస్ట‌మ్ వంటివి ఉన్నాయి. ఈ నివేదిక‌లో వెల్ల‌డైన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు చూసేద్దాం
  • అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో రిల‌య‌న్స్ నుంచి JioTag Go.. ధ‌ర కేవ‌లం రూ. 1,499
    భార‌త్‌లో JioTag Go పేరుతో స్మార్ట్ డివైజ్‌ను రిల‌య‌న్స్ సంస్థ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇది Google Find My Device నెట్‌వర్క్‌కు స‌పోర్ట్‌తో మ‌న దేశ‌పు మొట్టమొదటి Android ట్రాకర్‌గా గుర్తింపు పొందింది. వినియోగదారులు ట్రాకర్‌ను Google Find My Device యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించి గుర్తించగలరు. ఈ Bluetooth-enabled ట్రాకర్ ఒక సంవత్సరం వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది జూలైలో రిలయన్స్ JioTag ఎయిర్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇది Apple Find My నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటుంది
  • 500 కంటే ఎక్కువ లైవ్‌ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..
    కేంద్ర ప్ర‌భుత్వరంగ‌ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎన్ఎల్ (BSNL) దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవను ప్రారంభించినట్లు తెలిపింది. IFTVగా పిలువబడే ఈ సేవలను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ కొత్త లోగో, ఆరు కొత్త సౌకర్యాలను గత నెలలో మొదటిసారిగా పరిచయం చేసింది. వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్, పే టీవీ సౌకర్యంతో లైవ్ టీవీ స‌ర్వీసుల‌ను అందించేందుకు BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది.
  • ఆండ్రాయిడ్ 16పై కీల‌క అప్‌డేట్‌.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య వ‌చ్చేస్తోంది
    Google వెల్ల‌డించిన‌ వివరాల ప్రకారం.. Android 16 వెర్ష‌న్ వ‌చ్చే ఏడాది అంటే 2025 మొదిటి ఆరు నెల‌ల్లో విడుదల కానుంది. అక్టోబర్‌లో రిలీజ్ అయిన‌ పిక్సెల్ ఫోన్‌ల కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరి కాకుండా Google తాజా అప్‌డేటెడ్ Android వెర్షన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప‌రిచ‌యం చేయ‌నుంది. ఈ సంవత్సరం చివరి నాటికి చిన్న చిన్న మార్పుల‌తో విడుదల ఉంటుందని కంపెనీ స్ప‌ష్టం చేసింది. దీని ఆదారంగా యాప్ స్టెబిలిటీని మ‌రింత‌ మెరుగుపరిచేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అలాగే, వినియోగదారులకు కొత్త ఫీచర్‌లను అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ తరచుగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) అందుబాటులో ఉంచుతోంది
  • అక్టోబర్ 17 నుంచే దేశీయ మార్కెట్‌లో Google Pixel 9 Pro ప్రీ-ఆర్డర్‌లు.. ధ‌ర ఎంతో తెలుసా
    ఈ ఏడాది ఆగ‌స్టులో దేశీయ మార్కెట్‌లోని Google Pixel 9, Pixel 9 Pro XL, Pixel 9 Pro ఫోల్డ్‌తో Google Pixel 9 Pro లాంచ్ అయింది. అయితే, ప్రో వేరియంట్ ఆ సమయంలో మ‌న దేశంలో అందుబాటులోకి రాలేదు. తాజాగా ఈ వారం భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఫోన్ ధరతోపాటు రంగుల‌ను కూడా వెల్ల‌డించింది. Pixel 9 Pro టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పాటు టెన్సర్ G4 ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో ర‌న్ అవుతుంది
  • స్కిప్ బటన్ క‌నిపించ‌డం లేద‌ని వినియోగదారుల ఫిర్యాదుపై YouTube ఏమందంటే
    YouTube తన ప్రకటనలోని ఇంటర్‌ఫేస్‌లో వ‌చ్చే స్కిప్ బటన్ క‌నిపించ‌డం లేద‌ని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అయితే, మ‌రికొంత మంది మాత్రం కౌంట్‌డౌన్ టైం ముగిసిన తర్వాత అది కనిపిస్తుందని తెలిపారు. అయితే, ఈ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం స్కిప్ బటన్‌ను తాము ట్యాంపర్ చేయడం లేదని స్ప‌ష్టం చేసింది. అయినప్పటికీ, వ్యీవ‌ర్స్‌ అనుభవాన్ని మ‌రింత‌ మెరుగుపరచడానికి ప్రకటన ఇంటర్‌ఫేస్‌లో స‌మ‌యాన్ని తగ్గించే దిశ‌గా కంపెనీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో షార్ట్‌ల వ్యవధిని పెంచే నిర్ణయాన్ని కూడా కంపెనీ ప్రకటించింది. ప్ర‌స్తుతం ఉన్న‌ ఒక నిమిషానికి బదులుగా, Short యొక్క గరిష్ట నిడివి మూడు నిమిషాలకు పెంచుతుంది
  • Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్‌ఫోన్‌లై భారీ డిస్కౌంట్‌
    ఈ ఏడాది భార‌త్‌లో పండ‌గ సీజ‌న్‌ను Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024తో మ‌రింత ఆనందంగా జ‌రుపుకోవ‌చ్చు. ఈ సేల్‌ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంద‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. Flipkart ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 26న అంటే, 24 గంటల ముందే సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలతోపాటు అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌ల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా.. ఈ సేల్‌లో Google Pixel 8, Samsung Galaxy S23 హ్యాండ్‌సెట్‌లు స‌ర‌స‌మైన ధరలకు ల‌భించ‌బోతున్నాయి
  • ఆగస్టు 22 నుంచి అందుబాటులోకి Google Pixel 9 Pro Fold స్మార్ట్ ఫోన్‌
    మ‌న‌దేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో ఈ Pixel 9 Pro Fold త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతోంది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన‌ రెండవ పిక్సెల్-బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్ కాగా, భారతదేశంలో మొదటిది.
  • Pixel Watch 3, Google Pixel Buds Pro 2 ఫీచ‌ర్స్‌తోపాటు ధ‌ర మీకోసం!
    Pixel Buds Pro 2 ధర రూ. 22,900గా ఉంది. ఈ TWS హెడ్‌సెట్ హాజెల్, పియోనీ, పింగాణీ, వింటర్‌గ్రీన్ రంగులలో అందుబాటులో ఉండ‌నుంది.
  • దేశీయ మార్కెట్‌లోకి ఆగ‌స్టు 22న రాబోతోన్న Google Pixel 9.. ధ‌రెంతో తెలుసా?!
    భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏకైక మోడ‌ల్‌ Google Pixel 9 ఫోన్‌ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 79,999గా నిర్ణ‌యించారు.

Google - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »