Oneplus 13 Specifications

Oneplus 13 Specifications - ख़बरें

  • జనవరి 2025లో భార‌త్ స‌హా గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి.. OnePlus 13 హ్యాండ్‌సెట్ రాబోతోంది
    చైనాలో ఈ సంవ‌త్స‌రం అక్టోబర్ 31న OnePlus 13 స్మార్ట్ ఫోన్ లాంచయిన‌ విష‌యం తెలిసిందే. త్వరలో దీనిని భార‌త్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లలోనూ అందుబాటులోకి తీసుకురావాల‌ని కంపెనీ భావిస్తోంది. ఈ తాజా నాన్-ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ లాంచ్ టైమ్‌లైన్‌ను ఇప్ప‌టికే ధృవీకరించింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఈ ఏడాది ఇది అందుబాటులో ఉండదని స్పష్ట‌మైంది. Qualcomm న్యూ స్నాప్‌డ్రాగ‌న్‌ 8 Elite ప్రాసెస‌ర్ అండ‌ర్ ది హుడ్‌తో వ‌చ్చే మొదటి హ్యాండ్‌సెట్‌ల‌లో ఇదీ ఒక‌టి. OnePlus ఈ స్మార్ట్‌ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ఆప్టిక్స్‌తో రూపొందించింది
  • Geekbench లిస్టింగ్ ద్వారా OnePlus 13R స్పెసిఫికేషన్‌లు వెల్లడి.. త్వరలోనే అందుబాటులోకి
    ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లైన‌ OnePlus 12R స్మార్ట్ ఫోన్‌కు కొన‌సాగింపుగా OnePlus 13Rను కంపెనీ ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. తాజాగా, ఈ హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో క‌నిపించింది. అంతేకాదు, కంపెనీ ఇప్పటికే చైనాలో ఫ్లాగ్‌షిప్ OnePlus 13ని పరిచయం చేసింది. అలాగే, రాబోయే నెలల్లోనే ఈ హ్యాండ్‌సెట్‌ను గ్లోబల్ మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ హై-ఎండ్ స్మార్ట్ ఫోన్‌తో పాటు అందుబాటులోకి రానున్న‌ట్లు భావిస్తున్న OnePlus 13R నుంచి ఎలాంటి ఫీచ‌ర్స్‌ను కోరుకోవ‌చ్చే విష‌యంపై మొబైల్ మార్కెట్‌లో పెద్దఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది
  • ఇక రూమ‌ర్స్‌కు తెర‌ప‌డిన‌ట్లే.. OnePlus 13 లాంచ్ తేదీ ఫిక్స్ అయింది
    గ‌త ఏడాది విడుద‌లైన OnePlus 12కి కొన‌సాగింపుగా OnePlus 13 ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అవుతున్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో కొన్ని నెలలుగా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోన్న వార్త‌ల‌కు తెర‌ప‌డింది. ఈ కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ తేదీతోపాటు డిజైన్, క‌ల‌ర్‌ల‌ను వెల్లడించింది. చైనాలో లాంచ్‌కు ముందు జ‌రిగిన ఓ ఈ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో OnePlus 13 మోడ‌ల్ సంద‌డి చేసింది. ఈ హ్యాండ్‌సెట్ BOE X2 డిస్‌ప్లేతో లోక‌ర్‌ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను క‌లిగి ఉంటుంద‌ని నిర్ధారించబడింది
  • OnePlus 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ర‌న్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ OnePlus 13 కాబోతుందా
    చైనా మార్కెట్‌లో OnePlus 13 ఈ నెలలో ఏదో ఒక రోజున త‌ప్ప‌నిస‌రిగా లాంచ్ కాబోతున్న‌ట్లు స్ప‌ష్టమైన స‌మాచారం ఉంది. అయితే, విడుద‌ల‌కు సంబంధించిన‌ ఖచ్చితమైన తేదీపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. Qualcomm ప్రాసెస‌ర్‌తో స‌రికొత్త‌గా ఈ OnePlus ఫోన్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. OnePlus 13 న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని పొందుతున్నట్లు భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్ Xiaomi, Oppo నుండి వచ్చే త‌ర్వాతి మోడ‌ల్‌ల‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తున్నారు
  • OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌పై కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అధికారికంగా వెల్ల‌డి
    చైనాలో OnePlus 12కి కొన‌సాగింపుగా OnePlus 13ని త్వరలోనే లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీ గ‌తంలోనే ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిస్‌ప్లే వివరాలను అధికారికంగా వెల్లడించింది. తాజాగా, OnePlus సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ ఫోన్‌కు చెందిన ఛార్జింగ్ ఫీచర్‌ను వెల్ల‌డించారు. అలాగే, బ్యాటరీ పరిమాణంతో సహా స్మార్ట్‌ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి. OnePlus 13 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెస‌ర్ ద్వారా ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు
  • 6000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో వ‌స్తోన్న OnePlus 13 హ్యాండ్‌సెట్‌
    OnePlus తన OnePlus 13 మోడ‌ల్ గ‌త ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన OnePlus 12కి కొన‌సాగింపుగా తీసుకువ‌స్తున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు గత కొన్ని వారాలుగా మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆప్ప‌టికే దీని ప్రాసిస‌ర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ వంటి వివరాలతో సహా ఫోన్ యొక్క స్పెషిఫికేస‌న్స్ గతంలోనే లీక్ చేయబడ్డాయి. తాజాగా లాంచ్ టైమ్‌లైన్, ధర పరిధి, స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పులు వంటివి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టిప్‌స్టర్ బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా లాంటి కొన్ని కీలకమైన వివరాలను వెల్ల‌డించింది.

Oneplus 13 Specifications - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »