India

India - ख़बरें

  • త‌క్కువ ధ‌ర‌కే Redmi Smart Fire TV 2024 సిరీస్ వ‌చ్చేసింది
    దేశీయ మార్కెట్‌లోకి Redmi Smart Fire TV 4K 2024 సిరీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సిరీస్‌నుంచి 43-అంగుళాలు, 55-అంగుళాల వేరియంట్‌లలో రెండు మోడ‌ల్స్ లాంచ్ అయ్యాయి. Redmi కంపెనీ 55 అంగుళాల ఫైర్ టీవీని మార్కెట్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ రెండు వేరియంట్‌లు డిజైన్, డిస్‌ప్లే నాణ్యత, స్టోరేజ్, ఫీచర్‌లలో ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను క‌లిగి ఉంటాయి. అయితే, 43-అంగుళాల మోడల్ 24W స్పీకర్లను పొందే ఆడియో సిస్టమ్ వ‌స్తుండ‌గా, కంపెనీ మొద‌టిసారి లాంచ్ చేసిన‌ 55-అంగుళాల Fire TV మోడల్‌లో 30W స్పీకర్ సిస్టమ్‌తో వ‌స్తోంది. ముఖ్యంగా, Redmi Smart Fire TV 4K సిరీస్‌లో ఇన్‌బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వస్తుంది
  • కేవ‌లం రూ. 9,9999ల‌కే Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్‌
    దేశీయ మార్కెట్‌లోకి Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది. గత ఏడాది నవంబర్‌లో విడుద‌లైన‌Lava Blaze 2 5Gకి కొన‌సాగింపుగా కంపెనీ నుంచి వ‌స్తోన్న ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లతోపాటు MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్ వంటి స్పెసిఫికేషన్‌ల‌తో వ‌స్తోంది. అలాగే, Lava Blaze 3 5Gలో వైబ్ లైట్ కూడా ఉంది. ఇది ఫోటోగ్రఫీ సమయంలో లైటింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడే సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌గా చెప్పొచ్చు
  • HMD Skyline 12GB + 256GB వేరియంట్ ధ‌ర‌ రూ. 35,999.. అమ్మ‌కాలు షురూ
    గ్లోబ‌ల్ మార్కెట్‌లో విడుద‌లైన దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత మ‌న దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి HMD Skyline స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో జత చేయబడిన Snapdragon 7s Gen 2 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. అలాగే, 4,600mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో సెల్ఫ్‌-రిపేర్ కిట్‌తో అందించ‌బ‌డుతోంది. దీంతో వినియోగదారులు డిస్‌ప్లే, బ్యాటరీతో సహా ఫోన్‌లోని కొన్ని భాగాలను విడదీయ‌డంతోపాటు మ‌ళ్లీ సెట్ చేసుకోవ‌చ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో ర‌న్ అవుతుంది. 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో దీనిని రూపొందించారు
  • 7,000mAh బ్యాటరీతో Infinix Xpad వ‌చ్చేసింది
    దేశీయ మార్కెట్‌లోకి Infinix Xpad లాంచ్ అయింది. మ‌న భార‌త‌దేశంలో Infinix కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్టమొదటి ట్యాబ్ ఇది. ఈ Infinix Xpad 11-అంగుళాల ఫుల్‌-HD+ స్క్రీన్, 8-మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది Wi-Fi అలాగే 4G LTE కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తూ.. ఆండ్రాయిడ్ 14-ఆధారిత XOS 14తో ప‌నిచేస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ ట్యాబ్ 8GB వరకు RAMతో 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G99 ప్రాసెస‌ర్‌తో వస్తుంది. అంతేకాదు, ఈ ట్యాబ్‌ నెలాఖరులో దేశీయ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నిజానికి Infinix Xpad గ‌త నెల‌లోనే గ్లోబ‌ల్ మార్కెట్‌లో విడుద‌ల అయింది. ఇప్పుడు తాజాగా మ‌న దేశంలో దీనిని లాంచ్ చేశారు
  • ualcomm ప్రాసెస‌ర్‌తో విడుద‌లైన‌ JioPhone Prima 2 ఫీచ‌ర్స్ మీకోసం
    ప్ర‌ముఖ టెలికాం దిగ్గజం Jio మ‌న దేశీయ మార్కెట్‌లో Jio Phone Prima 2 ఫోన్‌ను విడుద‌ల చేసింది. నవంబర్ 2023లో భార‌త్‌లో ప్రవేశపెట్టన‌ JioPhone Prima 4G మోడ‌ల్‌కు మంచి ఆద‌ర‌ణ లభించ‌డంతో దాని అప్‌గ్రేడ్ వెర్స‌న్‌గా Jio నుండి వచ్చిన ఫీచర్ ఫోన్‌గా దీనిని లాంచ్ చేసింది. అంతేకాదు, గ‌తంలో విడుద‌ల చేసిన JioPhone Prima హ్యాండ్‌సెట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచ‌ర్స్‌ను జోడించింది. తాజా JioPhone Prima 2 హ్యాండ్‌సెట్‌ Qualcomm ప్రాసెస‌ర్‌, 2,000mAh బ్యాటరీతో 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో రూపొందించారు. ఇది వెనుక మరియు ముందు కెమెరాలను కలిగి ఉంటుంది
  • Vivo నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ వ‌స్తోంది.. Vivo T3 Ultra పూర్తి వివ‌రాలు ఇవే
    Vivo మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధ‌మైంది. Vivo T3 Ultra హ్యాండ్‌సెట్‌ను ఈ నెలాఖరులో తీసుకురానున్న‌ట్లు దృవీక‌రించ‌డంతోపాటు లాంచ్ తేదీని, దాని డిజైన్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా, Vivo నుంచి ఇటీవల T3 ప్రో హ్యాండ్‌సెట్ దేశీయ మార్కెట్‌లో విడుదలయ్యింది. రాబోయే Vivo T3 Ultra కూడా Vivo T3 ప్రో, Vivo T3 5G, Vivo T3 లైట్ 5G, Vivo T3x 5Gలను కలిగి ఉన్న Vivo T3 లైనప్‌లో చేరనుంది. Vivo T3 Ultra సెప్టెంబర్ 12న భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ X(ట్విట్ట‌ర్‌) పోస్ట్ ద్వారా ధృవీకరించింది
  • Reliance Jio 8వ వార్షికోత్సవం సంద‌ర్భంగా అధిరిపోయే ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించింది
    Reliance Jio 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్ర‌క‌టించింది. టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల పరిమిత సభ్యత్వంతోపాటు అర్హత ఉన్న ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ-కామర్స్ వోచర్‌లతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. Jio మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా ఇటీవ‌ల‌ భారతదేశంలోని తన కస్టమర్‌ల కోసం ముఖ్యమైన ప్రకటనలు చేసిన విష‌యం తెలిసిందే. Jio ఇప్పటివరకూ సుమారు 490 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు సేవలను అందిస్తోంది
  • అధిరిపోయే ఫీచ‌ర్స్‌తో వ‌చ్చేసింది.. Amazfit GTR 4 New స్మార్ట్‌వాచ్
    Amazfit దేశీయ మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ప‌రిచ‌యం చేసింది. Amazfit GTR 4 Newని మ‌న‌దేశంలో లాంచ్‌ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్ 1.45-అంగుళాల AMOLED స్క్రీన్‌తో ఆక‌ర్ష‌ణీయ‌మైన క్రౌన్‌ను కలిగి ఉంది. Amazfit GTR 4 New వెర్షన్ స్టెయిన్‌లెస్ స్టీల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్-సిరామిక్ బాటమ్ షెల్‌తో పాటు లెదర్, ఫ్లోరోఎలాస్టోమర్ స్ట్రాప్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ Zepp యాప్‌కి అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఇండిపెండెంట్ మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌తోపాటు ఇన్‌బిల్ట్ అలెక్సా కంట్రోల్ వంటి ఫీచ‌ర్స్‌తో ప‌రియ‌చం చేస్తోంది
  • కాలేజీ విద్యార్థులే ల‌క్ష్యంగా HP Victus స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లు
    ప్ర‌ముఖ‌ టెక్ బ్రాండ్ HP త‌న HP Victus స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లను దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ప్ర‌ధానంగా కాలేజీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. వేగ‌వంత‌మైన‌ పనితీరు, మంచి గేమింగ్ సామర్థ్యాలను అందిస్తుందని వెల్ల‌డించింది. ఈ ల్యాప్‌టాప్‌లలో 4GB వీడియో RAMతో Nvidia GeForce RTX 3050A జీపీయూని చేర్చడానికి కంపెనీ Nvidiaతో కలిసి పనిచేసింది. కంపెనీ HP గేమింగ్ గ్యారేజ్‌కి ఉచిత యాక్సెస్‌తో పాటు ఎస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, గేమ్ డెవలప్‌మెంట్‌పై ఆన్‌లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది
  • iPhone 15 Plus ఇప్పుడు రూ. 89,600 కాదు.. రూ. 75,999ల‌కే
    గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నెల‌లో iPhone 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతో పాటు iPhone 15 Plus లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడ‌ల్స్ కూడా ఉన్నాయి. స‌రిగ్గా మ‌ళ్లీ ఏడాదికి Apple నుంచి iPhone 16 లైనప్ సెప్టెంబర్ 9న లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్‌కు ముందు A16 బయోనిక్ చిప్‌సెట్-బ్యాక్డ్ iPhone 15 Plus ధరను దేశీయ మార్కెట్‌లోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో భారీగా త‌గ్గించింది. అంతేకాదు, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం చూపిస్తోన్న‌ ధ‌ర‌ల‌తో పోల్చితే ఈ మోడ‌ల్ ప్రారంభ ధర కంటే చాలా తక్కువగా ఉంది
  • స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వ‌స్తోన్న Vivo T3 Ultra ఫీచ‌ర్స్‌తోపాటు ధ‌రలు మీకోసం
    స్మార్ట్‌ఫోన్‌ల త‌యారీ దిగ్గ‌జ సంస్థ‌ Vivo నుంచి Vivo T3 Ultra పేరుతో కొత్త మోడ‌ల్ త్వరలో దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ వివ‌రాలు కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే అనేక లీక్‌లు, నివేదికల ఆధారంగా ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు RAM, స్టోరేజ్ వేరియంట్‌లు, దేశీయ మార్కెట్‌లో దీని ధరలను మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. Vivo T3 Ultra దేశంలో ప్రస్తుతం ఉన్న Vivo T3 సిరీస్ ఫోన్‌ల జాబితాలో చేర‌వ‌చ్చ‌ని తెలుస్తోంది
  • రూ. 24,999ల‌కు Vivo T3 Pro 5G.. సెప్టెంబ‌ర్ 3 నుంచి బుకింగ్స్‌
    Vivo త‌న‌ Vivo T3 Pro 5Gని దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెస‌ర్‌ ద్వారా ప‌నిచేస్తూ.. 12GB వరకు RAMతో రూపొందించ‌బడింది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తోపాటు 5,500mAh బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడ‌ల్ లాంచ్‌తో ఇప్ప‌టికే మ‌న దేశంలో అందుబాటులో ఉన్న Vivo T3 5G సిరీస్‌లో కొత్త‌గా చేరిన‌ట్ల‌యింది. ఈ సిరీస్‌లో Vivo T3 5G, Vivo T3 లైట్ 5G, Vivo T3x 5G మోడ‌ల్స్ ఉన్న విష‌యం తెలిసిందే.
  • ఆగ‌స్టు 27 నుంచి Poco Pad 5G సేల్‌.. ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్‌లు మీకోస‌మే
    ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ OSతో Poco Pad 5G ర‌న్ అవుతుంద‌ని కంపెనీ తెలిపింది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతోపాటు క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో రూపొందించ‌బ‌డింది.
  • Tecno Phantom V ఫ్లిప్ 2 5G ఫీచర్స్‌తోపాటు అంచ‌నా ధ‌ర కూడా లీక్ అయ్యింది!
    Tecno Phantom కంపెనీ త‌గ సంవ‌త్స‌రం విడుద‌ల చేసిన Tecno Phantom Vకి అప్‌డేటెడ్ వెర్ష‌న్‌గా ఈ Tecno Phantom V ఫ్లిప్ 2 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
  • ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌తో OnePlus Buds Pro 3 మార్కెట్‌లోకి వ‌చ్చేసింది!
    వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ మరియు రిటైల్ ఫ్లాట్‌ఫామ్‌ల‌ ద్వారా ఆగస్టు 23 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది.

India - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »