డిసెంబర్‌లోనే Realme Neo 7 విడుదల.. లాంచ్‌కు ముందే ధరతోపాటు కీలక విషయాల వెల్లడి
చైనాలో ఈ ఏడాది డిసెంబర్‌లోనే Realme Neo 7 లాంచ్ కాబోతున్నట్లు స్పష్టమైంది. అయితే, విడుడదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, లాంచ్‌కు ముందే రాబోయే స్మార్ట్ ఫోన్ ధర, బిల్డ్, బ్యాటరీ వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోంది. అలాగే, Realme Neo 7 ఫోన్‌లు కూడా Realme GT Neo 6, GT Neo 6 SEల మాదిరిగానే మంచి సేల్‌ను అందుకుంటాయని కంపెనీ భావిస్తోంది