Qualcomm

Qualcomm - ख़बरें

  • మారుతీ సుజుకి, Qualcomm భాగస్వామ్యంతో వాహనాల్లో స్నాప్‌డ్రాగన్ ఎలైట్ చిప్‌ల వినియోగం
    భారతదేశపు అతిపెద్ద ఆటోమోటివ్ తయారీ సంస్థ‌ మారుతీ సుజుకి నుంచి రాబోయే వాహనాలలో కొత్త స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ఆటోమోటివ్ చిప్‌లను ఉపయోగించ‌వ‌చ్చు. ఇందు కోసం Qualcomm భాగస్వామ్యం కుద‌ర్చుకున్న‌ట్లు ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ కొత్త ఆటోమోటివ్ చిప్ అధునాతన భద్రతా వ్యవస్థ, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతోపాటు ఇతర ఫీచ‌ర్స్‌ను అందించగలదని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇంతకుముందు, Qualcomm పెద్ద ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాతో టైఅప్ గురించి తెలియజేసింది
  • త‌్వ‌ర‌ప‌డండి.. OnePlus Pad 2 డిస్కౌంట్ సేల్‌.. అద‌న‌పు ఆఫర్‌లు కూడా ఉన్నాయి
    ఈ ఏడాది జూలైలో భారతదేశంలో OnePlus Pad 2ను ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌, 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,510mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 3K LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్‌ను నింబస్ గ్రే కలర్‌వేలో అందించారు. ఇది 8GB + 128GB, 12GB + 256GB వేరియంట్‌ల‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ స్టైలో 2 స్టైలస్, వన్‌ప్లస్ స్మార్ట్ కీబోర్డ్ విడిగా విక్రయించబడినప్ప‌టికీ పెయిర్‌గా వ‌చ్చింది. తాజాగా ఈ మోడ‌ల్‌పై కంపెనీ మంచి డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల‌ను పరిమిత సమయం వరకు అందిస్తోంది
  • 5X పెరిస్కోప్ కెమెరా, 6,100mAh భారీ బ్యాటరీతోపాటు Xiaomi 15 Pro స్పెసిఫికేషన్‌లివే
    చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం Xiaomi 15 సిరీస్ నుంచి కంపెనీ నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌ ఫ్లాగ్‌షిప్ Xiaomi 15, Xiaomi 15 Pro ఫోన్‌లు ఈ వారమే చైనాలో ప్రారంభించ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌ ద్వారా వ‌స్తోన్న ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాండ్‌సెట్‌గా నిర్ధారించబడింది. దీని లాంచింగ్ ముందే Xiaomi 15 Proలో 5X టెలిఫోటో కెమెరా, 6,100mAh స‌మార్థ్యం క‌లిగిన భారీ బ్యాటరీని అందించిన‌ట్లు దీనికి సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్.. ఇప్పుడు స‌రికొత్త‌గా వ‌చ్చేస్తోంది
    హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌ను Qualcomm ఆవిష్కరించింది. Qualcomm సరికొత్త మొబైల్ ప్రాసెసర్ ఆన్-డివైస్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మల్టీ-మోడల్ AI సామర్థ్యాలు, డెడికేటెడ్ హెక్జ్సన్‌ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU), సెకెండ్ జ‌న‌రేష‌న్‌ కస్టమ్ వంటి అప్‌గ్రేడ్‌లతో టాప్-ఆఫ్-ది-లైన్ పనితీరును అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అల‌గే, Qualcomm Oryon CPU, AI ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP)లు కూడా ఉన్నాయి. ఈ ల‌క్ష్యాల‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ దాని ముందున్న Snapdragon 8 Gen 3 కంటే మెరుగైన పనితీరుతో రానుంది
  • స‌రికొత్త‌ ప్రాసెస‌ర్‌తో Redmi A4 5G ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్ర‌త్య‌క్ష‌మైంది
    Qualcomm నుండి స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెస‌ర్‌తో వచ్చిన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా Redmi A4 5G మ‌న దేశంలో ఆవిష్కరించబడింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వార్షిక ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 ఈవెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను ప‌రిచ‌యం చేశారు. ఇది రూ. 10,000 కంటే త‌క్కువ ధ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది. అలాగే, భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో 5G సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి
  • OnePlus 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ర‌న్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ OnePlus 13 కాబోతుందా
    చైనా మార్కెట్‌లో OnePlus 13 ఈ నెలలో ఏదో ఒక రోజున త‌ప్ప‌నిస‌రిగా లాంచ్ కాబోతున్న‌ట్లు స్ప‌ష్టమైన స‌మాచారం ఉంది. అయితే, విడుద‌ల‌కు సంబంధించిన‌ ఖచ్చితమైన తేదీపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. Qualcomm ప్రాసెస‌ర్‌తో స‌రికొత్త‌గా ఈ OnePlus ఫోన్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. OnePlus 13 న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని పొందుతున్నట్లు భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్ Xiaomi, Oppo నుండి వచ్చే త‌ర్వాతి మోడ‌ల్‌ల‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తున్నారు
  • OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌పై కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అధికారికంగా వెల్ల‌డి
    చైనాలో OnePlus 12కి కొన‌సాగింపుగా OnePlus 13ని త్వరలోనే లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీ గ‌తంలోనే ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిస్‌ప్లే వివరాలను అధికారికంగా వెల్లడించింది. తాజాగా, OnePlus సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ ఫోన్‌కు చెందిన ఛార్జింగ్ ఫీచర్‌ను వెల్ల‌డించారు. అలాగే, బ్యాటరీ పరిమాణంతో సహా స్మార్ట్‌ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి. OnePlus 13 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెస‌ర్ ద్వారా ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు
  • ualcomm ప్రాసెస‌ర్‌తో విడుద‌లైన‌ JioPhone Prima 2 ఫీచ‌ర్స్ మీకోసం
    ప్ర‌ముఖ టెలికాం దిగ్గజం Jio మ‌న దేశీయ మార్కెట్‌లో Jio Phone Prima 2 ఫోన్‌ను విడుద‌ల చేసింది. నవంబర్ 2023లో భార‌త్‌లో ప్రవేశపెట్టన‌ JioPhone Prima 4G మోడ‌ల్‌కు మంచి ఆద‌ర‌ణ లభించ‌డంతో దాని అప్‌గ్రేడ్ వెర్స‌న్‌గా Jio నుండి వచ్చిన ఫీచర్ ఫోన్‌గా దీనిని లాంచ్ చేసింది. అంతేకాదు, గ‌తంలో విడుద‌ల చేసిన JioPhone Prima హ్యాండ్‌సెట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచ‌ర్స్‌ను జోడించింది. తాజా JioPhone Prima 2 హ్యాండ్‌సెట్‌ Qualcomm ప్రాసెస‌ర్‌, 2,000mAh బ్యాటరీతో 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో రూపొందించారు. ఇది వెనుక మరియు ముందు కెమెరాలను కలిగి ఉంటుంది
  • రూ. 24,999ల‌కు Vivo T3 Pro 5G.. సెప్టెంబ‌ర్ 3 నుంచి బుకింగ్స్‌
    Vivo త‌న‌ Vivo T3 Pro 5Gని దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెస‌ర్‌ ద్వారా ప‌నిచేస్తూ.. 12GB వరకు RAMతో రూపొందించ‌బడింది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తోపాటు 5,500mAh బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడ‌ల్ లాంచ్‌తో ఇప్ప‌టికే మ‌న దేశంలో అందుబాటులో ఉన్న Vivo T3 5G సిరీస్‌లో కొత్త‌గా చేరిన‌ట్ల‌యింది. ఈ సిరీస్‌లో Vivo T3 5G, Vivo T3 లైట్ 5G, Vivo T3x 5G మోడ‌ల్స్ ఉన్న విష‌యం తెలిసిందే.
  • కెమెరా ఇష్ట‌ప‌డేవారు ఈ Xiaomi 15 Ultra ఫోన్‌ ఫీచ‌ర్స్ తెలుసుకోవాల్సిందే!
    Xiaomi 15 Ultraకు సంబంధించిన ఎలాంటి విష‌యాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు ఈ చైనీస్ టెక్ బ్రాండ్. కానీ Xiaomi లాంచ్ చేయ‌బోయే మోడ‌ల్‌ స్పెసిఫికేషన్‌ల గురించి లీక్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Qualcomm - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »