Honor

Honor - ख़बरें

  • 200-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో హాన‌ర్ మ్యాజిక్‌ 7 RSR Porsche Design చైనాలో విడుద‌ల‌
    తాజాగా చైనాలో హాన‌ర్ మ్యాజిక్‌ 7 RSR Porsche Design ఫోన్‌ను లాంచ్ చేశారు. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్స్‌ను వెల్ల‌డించింది. నిజానికి, కంపెనీ లాంచ్‌కు ముందే ఓ టిప్‌స్టర్ ద్వారా ఈ మోడ‌ల్‌కు చెందిన కెమెరా స్పెసిఫికేష‌న్స్ బ‌హిర్గ‌తం అయ్యాయి. అంతేకాదు, గ‌తంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన లీక్‌ల ఆధారంగా ఫోన్ డిస్‌ప్లే, బిల్డ్‌, బ్యాట‌రీ వివ‌రాలు సైతం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఈ స‌రికొత్త హ్యాండ్‌సెట్ Honor Porsche Design Magic 6 RSRను విజ‌య‌వంతం చేస్తుంది. అలాగే, ఇది మ‌న దేశంలో అక్టోబ‌ర్‌లో ప‌రిచ‌య‌మైన‌ Magic 7 సిరీస్‌లో ఈ మోడ‌ల్‌ను చేర్చాల‌ని కంపెనీ భావిస్తున్న‌ట్లు స్పష్టమైంది
  • Honor GT ఫోన్‌ను చైనాలో లాంచ్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ మీకోసం
    Honor కంపెనీ నుండి స‌రికొత్త‌ గేమింగ్-ఫోకస్డ్ ఆఫర్‌గా Honor GT ఫోన్‌ను చైనాలో విడుద‌లైంది. ఈ కొత్త Honor స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. అలాగే, దీనిని 16GB RAMతో గరిష్టంగా 1TB వరకు స్టోరేజీతో రూపొందిచారు. Honor GT హ్యాండ్‌సెట్‌ 5,300mAh బ్యాటరీతో 100W వైర్డ్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను క‌లిగి ఉంటుంది
  • న్యూ Honor GT ప్రొడ‌క్ట్స్‌ డిసెంబర్ 16నే లాంచ్.. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోన్న‌ ఫోన్ డిజైన్
    గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో Honor 90 GT చైనాలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ మోడ‌ల్‌కు కొన‌సాగింపుగా మ‌రో హ్యాండ్‌సెట్ త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. రాబోయే కొత్త Honor GT ప్రొడ‌క్ట్స్‌ను ఈ నెలాఖరులో ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. అయితే, రాబోయే ప్రొడ‌క్ట్ యొక్క‌ మోనికర్‌ను మాత్రం కంపెనీ ఇంకా బ‌హిర్గ‌తం చేయ‌లేదు. అయితే, అది Honor 100 GTగా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు, దాని డిజైన్ కూడా ఫిక్స్ అయిన‌ట్లు భావిస్తున్నారు. అంతేకాదు, గ‌తంలోనే Honor 100 GT స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన‌విగా కొన్ని కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్స్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అలాగే, ఇప్పటికే ఉన్న Honor 90 GT కంటే అది అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ, ప్రాసెస‌ర్‌ను చూపుతోంది
  • 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా క‌లిగిన Honor X9c Smart స్పెసిఫికేష‌న్స్ మీకోసం
    తాజాగా మ‌లేషియాలో Honor X9c Smart ఫోన్‌ను ఆవిష్క‌రించారు. ఈ ఫోన్ 8GB RAMతో అటాచ్ చేసిన MediaTek DImensity 7025 Ultra ప్రాసెస‌ర్‌తో శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, 108-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని అందించారు. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టెన్స్‌తో వ‌స్తోంది. ఇది మ్యాజిక్ క్యాప్సూల్ ఫీచర్‌ను క‌లిగి ఉంటుంది. నోటిఫికేషన్ బార్ iPhoneలోని Apple డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. అలాగే, Honor X9cను నవంబర్‌లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే
  • 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెస‌ర్‌తో Xiaomi స్మార్ట్‌ఫోన్‌.. ఇందులో నిజ‌మెంత‌..
    ఈ వారం Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో, 6000mAh బ్యాటరీతో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ చైనీస్ టెక్ దిగ్గజం భారీ బ్యాటరీతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్లు చైనీస్ టిప్‌స్టర్ ఇటీవల బ‌హిర్గ‌తం చేసింది. ఈ కొత్త‌ Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
  • Honor 300 Ultra డిజైన్ లీక్ అయ్యింది.. త్వరలోనే చైనాలో లాంచ్‌కు సిద్ధం
    ప్ర‌ముఖ‌ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Honor త‌న స‌రికొత్త మోడ‌ల్ Honor 300 Ultra విడుద‌ల‌కు సిద్ధం చేస్తోంది. టిప్‌స్టర్ షేర్ చేసిన వివరాలను చూస్తే దీనిని ధృవీక‌రించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే Honor 300, 300 ప్రోలను లాంచ్ చేస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల ప్రీఆర్డర్‌లు ప్ర‌స్తుతం చైనాలో అందుబాటులో ఉన్నాయి. అయితే, అల్ట్రా మోడల్‌కు సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డించ‌లేదు. తాజాగా Honor 300 Ultra మోడ‌ల్‌కు చెందిన‌ రెండు ఫొటోలు చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీని డిజైన్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్స్ కూడా బ‌హిర్గ‌త‌మ‌య్యాయి
  • Honor 300 సిరీస్ లాంచ్‌కు ముందే టిప్‌స్టర్ లీక్ చేసిన‌ కీలక స్పెసిఫికేషన్స్ ఇవే
    Honor 300 సిరీస్‌ను త్వ‌ర‌లోనే చైనాలో ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ లైనప్‌లో రాబోయే హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన ప‌లు వివరాలు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, Honor 300, Honor 300 Pro మోడ‌ల్స్‌ కీలక స్పెసిఫికేషన్‌లు గతంలోనే బ‌హిర్గ‌తమ‌య్యాయి. బేస్ వేరియంట్‌కు చెందిన‌ లీకైన లైవ్ ఫొటోలు దాని డిజైన్‌ను ప‌రిచ‌యం చేశాయి. కంపెనీ Honor 300 రంగుల‌ ఎంపికతోపాటు పూర్తి డిజైన్‌ను సిరీస్ విడుద‌ల‌కు ముందే వెల్ల‌డించింది. అయితే, తాజాగా ఓ టిప్‌స్టర్ రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతోపాటు కొన్ని కీల‌క స్పెసిఫికేష‌న్స్‌ను వెల్ల‌డించారు
  • త్వ‌ర‌లోనే vanilla Honor 300తో పాటు Honor 300 Pro కూడా లాంచ్ కాబోతోంది.. పూర్తి వివ‌రాలు ఇవే
    త్వ‌ర‌లోనే vanilla Honor 300తో పాటు Honor 300 Pro కూడా లాంచ్ కాబోతోంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గ‌జం ఇంకా లాంచ్ తేదీని ధృవీకరించన‌ప్ప‌టికీ, ఈ లైనప్‌కు సంబంధించిన‌ కొన్ని కీల‌క వివ‌రాలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. Honor 300 సిరీస్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వ‌స్తోంది. అలాగే, Honor 300 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్ర‌సెస‌ర్‌తో రన్ అవుతుందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. Honor 300 Pro, Honor 300లు వరుసగా Honor 200 Pro, Honor 200 కంటే అప్‌గ్రేడ్‌లతో వస్తాయని అంచనా వేస్తున్నాయి
  • Android 15 ఆధారంగా AI ఫీచర్లతో చైనాలో లాంచ్ అయిన‌ Honor MagicOS 9.0
    స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇతర పరికరాల కోసం చైనాలో Honor MagicOS 9.0 అప్‌డేట్‌ను లాంచ్ చేశారు. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించబడింది. అలాగే, ఆపిల్ డైనమిక్ ఐలాండ్, న్యూ అండ్ నాచుర‌ల్ యానిమేషన్ ఇంజిన్, ఫేస్ స్వాప్ డిటెక్షన్, అప్‌గ్రేడ్ చేసిన టర్బో X సిస్టమ్‌పై Honor సొంతంగా తీసుకున్న స్మార్ట్ క్యాప్సూల్ వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని మోనిట‌ర్ చేయ‌డంతోపాటు AI నోట్స్, AI ట్రాన్సిలేష‌న్ వంటి అనేక AI సంబంధిత ఫీచర్లను బండిల్ చేస్తుంది
  • Honor X60 series నుంచి చైనాలో రెండు స‌రికొత్త‌ మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ..
    గ‌త ఏడాది జూలైలో లాంచ్ అయిన Honor X50 కొన‌సాగింపుగా Honor X60 series చైనాలో విడుద‌లైంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ లైనప్‌లో Honor X60, X60 Pro పేరుతో రెండు మోడల్‌లను ప‌రిచ‌యం చేసింది. రెండు మోడల్స్ కూడా 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాల లాంటి ఫీచ‌ర్స్‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. మరోవైపు, ఈ మోడల్స్‌లో ఒక‌టి మీడియాటెక్ డైమెన్సిటీ 7025-అల్ట్రా ప్రాసెస‌ర్‌తో వ‌స్తుండ‌గా.. Honor X60 Pro వేరియంట్ మాత్రం స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తో అందుబాటులోకి వ‌స్తుంది.
  • విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడ‌తోన్న Honor X7c 4G స్పెసిఫికేష‌న్స్‌
    కొత్త మోడ‌ల్‌ Honor X7c 4G స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ, ఈ 4G హ్యాండ్‌సెట్ కీలక ఇమేజ్‌లు, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇమేజ్‌ల‌లో ఇది నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల‌లో క‌నిపిస్తోంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేయ‌డంతోపాట ఈ స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5,200mAh బ్యాటరీతో రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. Honor X7c ఇప్ప‌టికే మార్కెట్‌లో విడుద‌లైన‌ Honor X7bకి కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి
  • Honor Magic 7 Pro కెమెరా విభాగంలో అధిరిపోయే ఫీచ‌ర్స్‌!
    Honor Magic 7 సిరీస్‌ ఇప్పటికే ఉన్న సిరీస్ మాదిరిగానే బేస్ మరియు ప్రో వేరియంట్‌ను కలిగి ఉండ‌నుంది.
  • Honor Magic V3 గ్లోబ‌ల్ లాంచింగ్ ఎప్పుడంటే?!
    కంపెనీ ప్ర‌క‌ట‌న దృష్ట్యా త్వరలో గ్లోబల్ మార్కెట్‌లలో కూడా Honor Magic V3 విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Honor - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »