50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో వస్తోన్న Tecno Camon 30S ధర ఎంతో తెలుసా
Tecno బ్రాండ్ నుండి సరికొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Tecno Camon 30S లాంచ్ అయ్యింది. ఇది 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండి, 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. అలాగే, 8GB వరకు RAMతో జత చేయబడిన MediaTek Helio G100 ప్రాసెసర్ ద్వారా పవర్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. Tecno Camon 30S Android 14లో రన్ అవుతుంది. దీనిని 33W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీతో అందిస్తున్నారు. Wi-Fi, NFC, 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది