Android 15

Android 15 - ख़बरें

  • గ‌్లోబ‌ల్ మార్కెట్‌ల‌లోకి Xiaomi 15 అల్ట్రాతోపాటు Xiaomi 15.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..
    చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ Xiaomi 15 Ultraను బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) ముందు గ్లోబ‌ల్ మార్కెట్లలో విడుదల చేసింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 27న చైనాలో ఆవిష్కరించరించ‌గా, స్టాండర్డ్, ప్రో మోడల్‌లను అక్టోబర్ 2024లో లాంఛ్ చేసింది. Xiaomi 15 సిరీస్‌లో 16GB వరకు RAMతో అటాచ్ చేయ‌బ‌డిన Snapdragon 8 Elite ప్రాసెస‌ర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లకు LTPO AMOLED డిస్‌ప్లేలతోపాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో, సిలికాన్ కార్బన్ బ్యాటరీలను అందించారు.
  • Realme P3x 5Gతో పాటు Realme P3 Pro 5G ఇండియాలో లాంఛ్‌.. వీటి ధర, స్పెసిఫికేషన్స్ తెలుసా
    కంపెనీ మిడ్‌రేంజ్ P సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా మ‌న దేశంలో Realme P3x 5Gతో పాటు Realme P3 Pro 5Gని లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రూపొందించ‌బ‌డి ఉన్నాయి. Realme P3 Pro 5G స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో న‌డుస్తుంది. Realme P3x 5G ఇటీవల ప్రారంభించబడిన MediaTek డైమెన్సిటీ 6400 ప్రాసెస‌ర్‌ని కలిగి ఉంది. ఇవి Realme UI 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో Android 15పై నడుస్తాయి.
  • అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో Samsung Galaxy S25, Galaxy S25+.. భార‌త్‌లో ధ‌ర ఎంతంటే
    ఈ ఏడాది జరిగిన మొదటి Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Samsung Galaxy S25, Galaxy S25+ లను కంపెనీ ప‌రిచ‌యం చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 12GB RAMతో అటాచ్‌ చేయబడిన కస్టమ్ Snapdragon 8 Elite for Galaxy ప్రాసెస‌ర్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, ఆర్ట్‌ఫియ‌ల్ ఇంటిల్‌జెన్సీ(AI) ఆధారిత Galaxy AI ఫీచర్‌లకు స‌పోర్ట్ చేస్తాయి. వీటిని 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. ఇవి కంపెనీ One UI 7 ఇంటర్‌ఫేస్‌తో Android 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో ర‌న్ అవుతాయి.
  • Geekbenchలో ప్ర‌త్య‌క్ష‌మైన‌ iQOO Z10 టర్బో, iQOO Z10 టర్బో ప్రో హ్యాండ్‌సెట్‌లు.. కీల‌క అంశాలు బ‌హిర్గ‌తం
    త్వ‌ర‌లోనే iQOO Z10 టర్బో, Z10 టర్బో ప్రోలను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ప్రోటోటైప్‌లను గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. రాబోయే iQOO Z10 టర్బో ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతున్న‌ట్లు చూపబడింది. అయితే, iQOO Z10 టర్బో హ్యాండ్‌సెట్‌ ప్రో మాత్రం స్నాప్‌డ్రాగన్ 8s ప్రాసెస‌ర్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో వీటికి సంబంధించిన ప్రాసెస‌ర్‌ల‌ పనితీరు, కోర్ కాన్ఫిగరేషన్ వివరాలను ప‌రిశీలించ‌వ‌చ్చు. iQOOకు రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌లు మ‌రింత ఆద‌ర‌ణ‌ను చేకూరుస్తాయ‌ని భావిస్తున్నారు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G
    చైనాలో అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఇండియా మార్కెట్‌లోకి Oppo Reno 13 5G, Reno 13 Pro 5Gలు విడుదల అయ్యాయి. ఈ కొత్త Reno సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర‌పై ర‌న్ అవుతాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి. Oppo Reno 13 Pro 5Gలో సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అయితే, వెనిల్లా మోడల్‌లో మాత్రం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇవి రెండూ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి
  • భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన OnePlus 13, OnePlus 13R.. ధ‌ర ఎంతంటే
    OnePlus 13, OnePlus 13R హ్యాండ్‌సెట్‌లు భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి విడుద‌ల‌య్యాయి. తాజా ఈ OnePlus స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తోపాటు 100W వరకు ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6,000mAh సామ‌ర్థ్యం ఉన్న భారీ బ్యాటరీతో అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ రెండు మోడ‌ల్స్‌ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్లను కలిగి ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 చైనాలో లాంచ్ అయ్యింది. బ్రాండ్-న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్ ఫోన్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. OnePlus 13R ఫోన్‌ OnePlus Ace 5 గ్లోబల్ వెర్షన్‌గా క‌నిపిస్తోంది
  • చైలా లాంచ్ అయిన Redmi Turbo 4 స్మార్ట్ ఫోన్.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేషన్స్ మీకోసం
    చైనాలో Redmi Turbo 4 ఫోన్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్‌ MediaTek Dimensity 8400-Ultra ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న వ‌స్తున్న మొద‌టి స్మార్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. అలాగే, 6,550mAh బ్యాటరీతో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది Xiaomi HyperOS 2.0 స్కిన్‌తో Android 15లో ర‌న్ అవుతోంది
  • ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో
    ఒక నివేదిక ప్ర‌కారం.. ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుకున్న మొట్టమొదటి నోకియా స్మార్ట్ ఫోన్‌గా HMD పల్స్ ప్రో అవతరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో ప‌రిచ‌య‌మైంది. అలాగే, ఇది ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతోంది. అయితే, HMD పల్స్ ప్రో కోసం తాజా Android 15 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో వ‌ర్కింగ్‌ బూస్ట్, అడాప్టివ్ బ్యాటరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రైవ‌సీ లాంటి ఫీచర్లను తీసుకువస్తుందని వెల్ల‌డైంది. అలాగే, ఇందులో సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు, లేటెస్ట్‌ నోటిఫికేషన్ కంట్రోల్ సిస్ట‌మ్ వంటివి ఉన్నాయి. ఈ నివేదిక‌లో వెల్ల‌డైన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు చూసేద్దాం
  • చైనా మార్కెట్‌లోకి OnePlus Ace 5 Pro, OnePlus Ace 5లు వ‌చ్చేశాయి.. ధ‌ర ఎంతంటే
    చైనాలో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ కొత్త OnePlus Ace సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజీతో వ‌స్తున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుండ‌గా, Ace 5 మోడ‌ల్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండూ చైనాలో కొనుగోలు చేసేందుకు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయి
  • Honor GT ఫోన్‌ను చైనాలో లాంచ్‌.. ధ‌ర‌తోపాటు స్పెసిఫికేష‌న్స్ మీకోసం
    Honor కంపెనీ నుండి స‌రికొత్త‌ గేమింగ్-ఫోకస్డ్ ఆఫర్‌గా Honor GT ఫోన్‌ను చైనాలో విడుద‌లైంది. ఈ కొత్త Honor స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. అలాగే, దీనిని 16GB RAMతో గరిష్టంగా 1TB వరకు స్టోరేజీతో రూపొందిచారు. Honor GT హ్యాండ్‌సెట్‌ 5,300mAh బ్యాటరీతో 100W వైర్డ్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను క‌లిగి ఉంటుంది
  • ఇండియాలో విడుద‌లైన Vivo X200 Pro, Vivo X200 ఫోన్‌లు.. ధ‌ర చూస్తే షాక్ అవుతారు
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Vivo X200 Pro, Vivo X200 హ్యాండ్‌సెట్‌లు విడుద‌ల అయ్యాయి. ఈ కొత్త Vivo X సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో ర‌న్ అవుతాయి. నీరు, ధూళి నియంత్ర‌ణ కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. Zeiss కో-ఇంజనీరింగ్‌తో కూడిన‌ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 సిరీస్‌లో అందించారు. అలాగే, ప్రో మోడల్‌లో Vivo అంతర్గత V3+ ఇమేజింగ్ చిప్‌తో వ‌స్తుంది. ఇవి వరుసగా 5800mAh, 6000mAh సామ‌ర్థ్యం గ‌ల‌ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ Vivo X200 సిరీస్ చైనాలో లాంచ్ చేశారు
  • 7000mAh భారీ బ్యాటరీతో చైనాలో అడుగుపెట్టిన Realme Neo 7 ఫోన్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    Neo సిరీస్ నుంచి తాజాగా Realme Neo 7 పేరుతో కంపెనీ కొత్త మోడ‌ల్‌ను చైనాలో లాంచ్ చేసింది. MediaTek Dimensity 9300+ ప్రాసెస‌ర్‌పై ఈ కొత్త Realme ఫోన్ ర‌న్ అవుతుంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అంతేకాదు, Realme GT Neo 6 ఫోన్‌కు కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ Realme Neo 7 హ్యాండ్‌సెట్‌కు GT బ్రాండింగ్ అనేది లేదు. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీతో వ‌స్తుంది. Realme Neo 7 దుమ్ము, నీటి నియంత్రం కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది
  • 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలతో iQOO 13 ఫోన్ లాంచ్‌.. ధ‌ర ఎంతంటే..
    భారతీయ మొబైల్ మార్కెట్‌లో Qualcomm నుండి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన‌ రెండ‌వ స్మార్ట్ ఫోన్‌గా iQOO 13 లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో రూపొందించ‌బ‌డి ఉంటుంది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల AMOLED స్క్రీన్‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇది Vivo Funtouch OS 15 స్కిన్‌తో పాటు Android 15పై రన్ అవుతోంది. కంపెనీ 120W వద్ద ఛార్జ్ చేయగల 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.iQOO 13
  • భారత్‌లో iQOO 13 ఫోన్ లాంచ్‌కు వారం ముందే ధర తెలిసిపోయింది.. ఎంతంటే
    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లోకి iQOO 13 హ్యాండ్‌సెట్‌ డిసెంబర్ 3న లాంచ్ కానుంది. అయితే, దీని అధికారిక లాంచ్‌కు ముందే ఓ టిప్‌స్టర్ మ‌న దేశంలో ఈ ఫోన్ ధరను వెల్ల‌డించారు. నిజానికి, అక్టోబర్‌లోనే చైనాలో iQOO 13 స్మార్ట్ ఫోన్‌ విడుద‌లైంది. అండ‌ర్ ది హుండ్‌ Qualcomm అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌ను కలిగి ఉన్న మొదటి హ్యాండ్‌సెట్‌లలో ఇదొకటి. iQOO 13 Android 15లో ర‌న్ అవుతోంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది
  • Exynos 2500 ప్రాసెస‌ర్‌, Android 15తో Samsung Galaxy S25+ గీక్‌బెంచ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది
    Samsung అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Galaxy S25 సిరీస్ 2025 ప్రథమార్ధంలో విడుదల కానుంది. రాబోయే Galaxy S కూడా మునుపటి లైనప్‌ల మాదిరిగా వనిల్లా, ప్లస్, అల్ట్రా మోడల్‌లలో వస్తుందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. తాజాగా Galaxy S25+ వేరియంట్‌కు సంబంధించిన‌ కీలక వివరాలు Geekbench బెంచ్‌మార్కింగ్ సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని Galaxy S25 ఫోన్‌లకు Samsung Snapdragon ప్రాసెసర్‌లను అందిస్తుందని గతంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ మోడ‌ల్‌కు సంబంధించిన ప‌లు స‌రికొత్త ఫీచ‌ర్స్ సైతం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి

Android 15 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »