Ott

Ott - ख़बरें

  • రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ OTT విడుదల తేదీ వ‌చ్చేసింది.. ఆన్‌లైన్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
    కోలీవుడ్ తాజా బ్లాక్ బస్టర్ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలలో రూ. 120 కోట్ల కలెక్షన్‌ల‌ను దాటేసింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించారు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన‌ ఈ చిత్రం పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించింది. థియేటర్లలో రన్ అయిన తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OTT విడుదలకు స‌న్న‌ద్ధ‌మైంది. ఈ రిలీజ్‌పై జ‌రుగుతోన్న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌పై ఓ లుక్ వేద్దాం రండి!
  • రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి
    మ‌న దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీని ద్వారా కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar నుండి కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేందుకు అవ‌కాశాం క‌ల్పిస్తోంది. ఇది ప్లాన్ ప్రయోజనాలతో పాటు ఉచిత JioHotstar సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. JioCinema, Disney+ Hotstar విలీనం తర్వాత ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇటీవల భార‌త్‌లో లాంఛ్ చేయ‌బ‌డింది. ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్‌-స‌పోర్ట్‌ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.
  • ఎట్ట‌కేల‌కు అఖిల్ అక్కినేని న‌టించిన‌ ఏజెంట్ మూవీ OTT రిలీజ్‌.. మార్చి 14న సోనీ LIVలో ప్రీమియర్
    టాలీవుడ్ ప్రేక్ష‌కులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న‌ అఖిల్ అక్కినేని యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ OTT విడుదల తేదీ ఖరారయ్యింది. ప‌లు వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 14న సోనీ LIVలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నిజానికి, థియేటర్లలో దీని టాక్‌ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఉత్సుకతతో ఎద‌రుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాలు కీలక పాత్రల్లో నటించారు.
  • సంక్రాంతికి వస్తున్నాం OTT రిలీజ్‌ తేదీ వ‌చ్చేసింది.. మార్చి 1, 2025న Zee5లో ప్ర‌సారం కానుంది
    థియేట‌ర్‌ల‌లో విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకున్న‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద కానుల వ‌ర్షం కురిపించిన‌ ఈ సినిమా మార్చి 1, 2025న Zee5లో ప్ర‌చారం కానుంది. జనవరి 14, 2025న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలై మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నారు.
  • తుడారుమ్ OTT రిలీజ్‌ అప్‌డేట్.. థియేటర్లలో విడుదల‌ తర్వాత ఎక్కడ చూడాలంటే..
    ప్రముఖ నటులు మోహన్ లాల్, శోభన నటించిన మలయాళ థ్రిల్లర్ మూవీ తుడారుమ్ ఈ ఏడాది మ‌ధ్య‌లో థియేటర్లలో విడుదల కానుంది. మొదటగా సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందని భావించినప్పటికీ, సినిమా విడుదల వాయిదా పడింది. జియో హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ముందుగానే ఖరారు చేశారని నివేదికలు చెబుతున్నాయి. అయితే, విడుదల ఆలస్యం వెనుక ఉన్న కారణాలపై ప‌లు ఊహాగానాలు ప్ర‌చార‌మ‌య్యాయి. OTT హక్కులు అమ్ముడవ్వ‌క పోకపోవడంతోనే వాయిదా పడిందని గతంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేద‌ని ప్రొడక్షన్ పేర్కొంది. కాంట్రాక్ట్ బాధ్య‌త‌ల‌తోపాటు, వ్యూహాత్మ‌కమైన నిర్ణ‌యాల కార‌ణంగానే ఆల‌స్యమైంద‌ని వెల్ల‌డించింది.
  • జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లాంఛ్‌
    రిలయన్స్ సంస్థ‌కు చెందిన‌ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి రూపొందించిన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను జియోస్టార్ లాంఛ్ చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ ప్లాట్‌ఫామ్ రెండు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌ల మొత్తం కంటెంట్ లైబ్రరీని హోస్ట్ చేస్తుంది. తాజాగా, ఈ రెండు విలీన సంస్థల నుండి షోలు, సినిమాలతో పాటు, వివిధ అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుండి కంటెంట్‌ను కూడా హోస్ట్ చేస్తుంది. జాయింట్ వెంచర్ స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ కోసం ఫ్రీ టైర్‌ కూడా ప్రకటించింది. ముఖ్యంగా, వయాకామ్ 18, స్టార్ ఇండియా విజయవంతమైన విలీనం తర్వాత నవంబర్ 2024లో జియోస్టార్ జాయింట్ వెంచర్ ఏర్పడింది.
  • ఫిబ్రవరి 11న ప్రేక్ష‌కుల ముందుకు.. తమిళ రొమాంటిక్ డ్రామా కాదలిక్కా నేరమిళ్లై OTT రిలీజ్‌
    నిత్యా మీనన్, రవి మోహన్ నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా కాదలిక్కా నేరమిళ్లై థియేటర్లలో విడుదలైన తర్వాత OTT రిలీజ్‌కు సిద్ధ‌మైంది. చిత్రనిర్మాత కృతిక‌ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమ, ఆధునిక సంబంధాలు, వివాహం, విచిత్రమైన సంబంధాల ఇతివృత్తాల‌తో రూపొందించ‌బడింది. సంక్రాంతి సందర్భంగా సినిమా థియేట‌ర్‌ల‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుంది. డిజిటల్ హక్కులను ఒక ప్రధాన OTT సర్వీస్ కొనుగోలు చేసింది. వీక్షకులు త్వరలో ఈ సినిమాని ఆన్‌లైన్‌లో చూడొచ్చు.
  • ఇండియాలో ప్రారంభ‌మైన‌ Dor Play యాప్‌.. 20+ OTT, 300+ లైవ్ టీవీ ఛానెల్‌లను ఒకే వేదిక‌పై చూసేయండి..
    భార‌త్‌లోని ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం స్ట్రీమ్‌బాక్స్ మీడియా Dor Play అనే యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్‌ 20 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌ల యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు ప్రతి స్ట్రీమింగ్ సర్వీస్ లేదా ఛానెల్‌కు వ్యక్తిగతంగా సైన్ అప్ చేసేందుకు బదులుగా కొత్తగా వ‌చ్చిన ఈ యాప్ సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటే స‌రిపోతుంది. గత సంవత్సరం, కంపెనీ Dor టీవీ OSతో Dorను పరిచయం చేసింది. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత టెలివిజన్ సేవల‌ను అందిస్తుంది. స్ట్రీమ్‌బాక్స్ మీడియా నవంబర్ 2024లో దాని Dor QLED స్మార్ట్ టీవీల రేంజ్‌ని ఆవిష్కరించింది.
  • మార్కో OTT రిలీజ్‌ తేదీ వ‌చ్చేసింది: ఫిబ్ర‌వ‌రి 14న‌ Sony LIVలో ప్రసారం
    అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తోన్న‌ మలయాళ యాక్షన్-థ్రిల్లర్ మూవీ మార్కో OTT విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. Sony LIVలో ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రసారం కానున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. విజయవంతమైన థియేటర్ రన్ తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడంతో మ‌రింత ప్రేక్ష‌కాధార‌ణ పొందుతుందని భావిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా బహుళ భాషలలో అందుబాటులోకి రానుంది.
  • పోతుగడ్డ OTT రిలీజ్‌: రక్ష వీరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ తెలుగు థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్క‌డంటే
    అనేక వాయిదాల త‌ర్వాత ఎట్ట‌కేట‌ల‌కు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న తెలుగు థ్రిల్ల‌ర్ చిత్రం పోతుగడ్డ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. రక్ష వీరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 30, 2025న OTTలోకి రానుంది. నిజానికి, నవంబర్ 2024లో మూవీ రిలీజ్‌ కావాల్సి ఉండగా, ఈ సినిమా ప్రీమియర్‌ను సంక్రాంతి పండుగ త‌ర్వాత‌కు వాయిదా వేసి, డిజిటల్ ఫ్లాట్‌ఫార‌మ్‌పై విడుద‌ల‌కు సిద్ధం చేశారు. ఓ ప్రేమ‌ జంట ప్ర‌యాణిస్తోన్న బ‌స్సులో ఏం జ‌రిగింది? రాజ‌కీయ చద‌రంగంలో వారి ప్రేమ ప్ర‌యాణం, మనుగడ కోసం సాగే పోరాటంగా ఎలా మారుతుంది? ఇలాంటి ఆస‌క్తిక‌ర కథాంశంతో ద‌ర్శ‌కుడు మూవీపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించార‌నే చెప్పాలి.
  • OTTలోకి త్వ‌ర‌లో మ‌ళ‌యాల బ్లాక్ బాస్ట‌ర్ మూవీ మార్కో.. భారీ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ Sony LIV
    యువ‌ న‌టుడు ఉన్ని ముకుందన్ హీరోగా న‌టించిన యాక్షన్-డ్రామా చిత్రం మార్కో. థియేటర్‌ల‌లో ఘ‌న‌ విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లకుపైగా వసూలు చేసి ప‌లు రికార్డులను బద్దలు కొట్టింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వైలెన్స్‌తోపాటు ఉత్కంఠభరితమైన కథనంతో రూ. 100 కోట్ల మార్కును అధిగమించిన మొదటి A- రేటింగ్ పొందిన మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత, సంచలనాత్మక OTT ఒప్పందాన్ని చేసుకోవ‌డం ద్వారా మరొక రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సినిమా డిజిటల్ హక్కులను Sony LIV సంస్థ సొంతం చేసుకుంది. మలయాళ చ‌ల‌న చిత్ర‌ చరిత్రలో అత్యధిక ధరను పొందినట్లు సమాచారం.
  • జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్
    రిలయన్స్ జియో తన జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌ల‌లో కొంతమందికి రెండేళ్లపాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియం స‌ర్వీసులు యాక్సెస్‌ను అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఆఫర్ దేశంలోని జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు వారు ఎంపిక చేసిన ప్లాన్‌లతో అందించ‌బ‌డుతోంది. ఈ ప్రయోజనాలను స‌ద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, బ్యాగ్రౌండ్ ప్లేబ్యాక్‌కు స‌పోర్ట్ చేస్తుంది. అలాగే, ఇది యూట్యూబ్ మ్యూజిక్‌కు ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో చూసేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులకు అవ‌కాశం క‌ల్పిస్తుంది
  • Airtel Wi-Fi వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. రూ. 699 ప్లాన్‌తో ఉచిత Zee5 OTT సబ్‌స్క్రిప్షన్
    భారతీ ఎయిర్‌టెల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Zee5తో భాగ‌స్వామ్యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. భారతదేశంలో ఎయిర్‌టెల్ Wi-Fi ప్లాన్‌ల‌లో రూ. 699 లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తం తీసుకున్న‌ చందాదారులంద‌రూ Zee5 కంటెంట్‌ ఉచిత యాక్సెస్‌ను పొందవ‌చ్చు. ఈ OTT ప్లాట్‌ఫారమ్ 1.5 లక్షల గంటల కంటే ఎక్కువ కంటెంట్‌ను అందిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఉదాహ‌ర‌ణ‌కు రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ Wi-Fi ప్లాన్ వినియోగదారులకు ఉచిత Zee5 సబ్‌స్క్రిప్షన్ రూ. 599గా ఉంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ప్ర‌క‌టించిన‌ ప్లాన్‌పై ఇప్ప‌టికే డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మ‌రెన్నో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లకు యాక్సెస్ కలిగి ఉన్నారు
  • 500 కంటే ఎక్కువ లైవ్‌ ఛానెల్‌లతో.. ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవలను ప్రారంభించన BSNL..
    కేంద్ర ప్ర‌భుత్వరంగ‌ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎన్ఎల్ (BSNL) దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రనెట్ టీవీ సేవను ప్రారంభించినట్లు తెలిపింది. IFTVగా పిలువబడే ఈ సేవలను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ కొత్త లోగో, ఆరు కొత్త సౌకర్యాలను గత నెలలో మొదటిసారిగా పరిచయం చేసింది. వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్, పే టీవీ సౌకర్యంతో లైవ్ టీవీ స‌ర్వీసుల‌ను అందించేందుకు BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది.
  • దీపావళి ధమాకా ఆఫర్‌.. ఏడాదిపాటు JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం
    భార‌తీయ టెలికాం దిగ్గ‌జం రిలయన్స్ జియో త‌న‌ JioAirFiber కోసం సరికొత్త దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా కొత్త వినియోగ‌దారుల‌తోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఒక ఏడాదిపాటు JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్‌ను పొందడానికి కొత్త కస్టమర్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో రూ. 20వేల వ‌ర‌కూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇప్పటికే ఉన్న వినియోగదారులు అదే ప్రయోజనాలను పొందేందుకు మూడు నెలల JioAirFiber ప్ర‌త్యేక‌ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇటీవల ఈ టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ కంపెనీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో Zomato గోల్డ్, OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందించింది.

Ott - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »